అక్షరటుడే, వెబ్‌డెస్క్: Ayodhya terror plot | దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తూ.. అయోధ్యలోని ప్రతిష్ఠాత్మక శ్రీరామ మందిరాన్ని లక్ష్యంగా చేసుకుని సాగుతున్న భారీ ఉగ్రవాద కుట్రను భద్రతా బలగాలు, కర్ణాటక పోలీసులు సంయుక్తంగా భగ్నం చేశారు.
ఉత్తరప్రదేశ్ అయోధ్య ఆలయంలో భారీ పేలుళ్లకు పాల్పడేందుకు వ్యూహం రచించిన ఒక అనుమానిత ఉగ్రవాదిని కర్ణాటక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని ఉత్తరప్రదేశ్‌కు చెందిన వలస కూలీగా గుర్తించారు.
Hyderabad Water Crisis | ఐటీ హబ్‌ల తళతళల వెనుక ‘జల’ సంక్షోభం: భాగ్యనగరంలో పాతాళంలోకి భూగర్భ జలాలు!
Ayodhya terror plot | వలస కూలీ ముసుగులో ఉగ్ర కుట్ర
పోలీసుల కథనం ప్రకారం.. కర్ణాటకలోని దావణగెరె జిల్లా హరిహర తాలూకా బన్నికోడు గ్రామంలో వలస కూలీగా పనిచేస్తున్న సొహైల్ అనే యువకుడిని నిఘా వర్గాల పక్కా సమాచారంతో పోలీసులు అరెస్టు చేశారు.
నిందితుడు ఉత్తరప్రదేశ్ ప్రాంతానికి చెందినవాడిగా గుర్తించారు. ఇక్కడ సాధారణ కార్మికుడిగా జీవనం సాగిస్తూ, ఎవరికీ అనుమానం రాకుండా తెరవెనుక దేశద్రోహ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది.
Ayodhya terror plot పాకిస్తాన్ హ్యాండ్లర్లతో ప్రత్యక్ష సంబంధాలు
నిందితుడు సొహైల్‌కు సంబంధించిన మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించిన అధికారులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. సరిహద్దు అవతల ఉన్న పాకిస్తాన్‌కు చెందిన లష్కరే తోయిబా, ఐఎస్ఐ వంటి కీలక ఉగ్రవాద సంస్థల హ్యాండ్లర్లతో అతడు నిరంతరం టచ్‌లో ఉన్నట్లు నిర్ధారణ అయింది.
ముఖ్యంగా పాక్ ఉగ్రవాద సూత్రధారి ‘రాణా హునైన్’ అనే వ్యక్తితో సొహైల్ నేరుగా మాట్లాడిన ఆడియో ఫైళ్లను, వాట్సాప్ చాట్లను దర్యాప్తు సంస్థలు స్వాధీనం చేసుకున్నాయి.
Ayodhya terror plot | దాడుల ప్రణాళిక.. ఆయుధాల కోసం డిమాండ్
అయోధ్య రామమందిరంతో పాటు దేశంలోని కొన్ని ప్రముఖ మతపరమైన సంస్థలపై దాడులు చేయడమే లక్ష్యంగా ఈ నెట్‌వర్క్ పనిచేస్తోందని నిఘా వర్గాలు వెల్లడించారు. ఈ ఘాతుకానికి పాల్పడేందుకు సొహైల్ పాకిస్తాన్ లోని తన హ్యాండ్లర్ల నుంచి భారీగా నిధులు, ఏకే-47 (AK-47) రైఫిళ్లను డిమాండ్ చేసినట్లు విచారణలో తేలింది. వలస కూలీ ముసుగులో స్థానికంగా మరికొందరిని బ్రెయిన్ వాష్ చేసేందుకు కూడా ఇతడు ప్రయత్నించినట్లు సమాచారం.
సొహైల్ అరెస్టుతో అలర్ట్ అయిన కేంద్ర నిఘా సంస్థలు అయోధ్య సహా దేశంలోని ప్రధాన నగరాలు, ఆధ్యాత్మిక క్షేత్రాల వద్ద భద్రతను పటిష్టం చేయాల్సిందిగా హెచ్చరికలు జారీ చేశాయి.
ప్రస్తుతం నిందితుడిని తుమకూరు, హరిహర రూరల్ పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. ఇతనితో పాటు వచ్చిన మరో 10 మంది అనుమానితులను కూడా పోలీసులు నిశితంగా ప్రశ్నిస్తున్నారు. ఈ ఆపరేషన్‌తో ఒక ముంచుకొస్తున్న జాతీయ భద్రతా ముప్పు తృటిలో తప్పినట్లయింది.