అక్షరటుడే, వెబ్డెస్క్: Telangana SIR | తెలంగాణ (Telangana)లో నేటి నుంచి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ ప్రారంభం అయింది. జూలై 24 వరకు ఇంటింటి సర్వే నిర్వహించనున్నారు. రాష్ట్రంలో ఉన్న 3,38,26,448 మంది ఓటర్లకు BLOలు ఎన్యూమరేషన్ పత్రాలు ఇవ్వనున్నారు. ఈ పత్రాలను నింపి జూలై 24 వరకు తిరిగి BLOలకు అందజేయాల్సి ఉంటుంది.
బీఎల్వో (BLO)లు ఇంటింటికి వెళ్లనున్నారు. సగటున వెయ్యి మంది ఓటర్లకు ఒక బీఎల్వోను నియమించారు. వివరాల కోసం బీఎల్వోలు మూడుసార్లు ఇళ్లకు వెళ్లనున్నారు. బీఎల్వోలు ఇచ్చే ఎన్యుమరేషన్ ఫారాలు నింపి ఇస్తేనే ముసాయిదా ఓటరు జాబితాలో పేరు ఉంటుంది. లేదంటే ఓటు హక్కు తొలగిస్తారు. ఎస్ఐఆర్ ప్రక్రియ జులై 24న ముగుస్తుంది. అనంతరం అదే నెల 31న ముసాయిదా జాబితా విడుదల చేస్తారు.
Telangana SIR | అభ్యంతరాలకు అవకాశం

డ్రాఫ్ట్ జాబితాపై అభ్యంతరాలు ఉంటే ఓటర్లు దరఖాస్తు చేసుకోవచ్చు. దీని కోసం ఆగస్టు 30 వరకు గడువు ఉంది. అనంతరం ఎన్నికల కమిషన్ నోటీసు ఇస్తే 12 ఆధారాల్లో ఏదైనా ఒకటి సమర్పించాల్సి ఉంటుంది. అభ్యంతరాల పరిశీలన అనంతరం అక్టోబరు 1న తుది జాబితా ప్రకటిస్తారు.
ఇది కూడా చదవండి..: Rain Forecast | నేడు పలు జిల్లాలకు మోస్తరు వర్ష సూచన