అక్షరటుడే వెబ్‌డెస్క్: Operation Amistad | తీవ్ర భూకంప విపత్తుతో అతలాకుతలమైన వెనిజులా దేశానికి అండగా నిలిచేందుకు భారత ప్రభుత్వం తక్షణమే స్పందించింది. సంక్షోభంలో చిక్కుకున్న వెనిజులా ప్రజలను ఆదుకోవడానికి , అవసరమైన అత్యవసర ఔషధాలు, సహాయక సామగ్రిని పంపించడానికి భారత్ అధికారికంగా ‘ఆపరేషన్ అమిస్టాడ్’ (Operation Amistad) ను ప్రారంభించింది. స్పానిష్ భాషలో ‘అమిస్టాడ్’ అంటే ‘స్నేహం’ అని అర్థం. ఈ కష్టకాలంలో వెనిజులా ప్రభుత్వానికి, అక్కడి పౌరులకు తాము పూర్తి అండగా ఉంటామని, అంతర్జాతీయ వేదికపై భారతదేశపు స్నేహపూర్వక బాధ్యతను చాటిచెప్పడానికే ఈ ప్రత్యేక ఆపరేషన్‌ను చేపట్టినట్లు విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ అధికారికంగా ప్రకటించారు. విపత్తు సంభవించిన ప్రాంతాల్లో వైద్య సేవలు కుప్పకూలకుండా చూడటం , క్షతగాత్రుల ప్రాణాలు రక్షించడమే లక్ష్యంగా భారత్ ఈ రక్షణ, సహాయక చర్యలను వేగవంతం చేసింది. అంతర్జాతీయ సమాజంలో ఒక బాధ్యతాయుతమైన దేశంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న మిత్రదేశానికి భారత్ తనవంతు పూర్తి సహకారాన్ని అందిస్తోంది.
Operation Amistad | సహాయక సామగ్రితో వెనిజులాకు బయల్దేరిన విమానాలు..
ఈ మానవతా సహాయక మిషన్‌లో భాగంగా భారత వైమానిక దళానికి చెందిన రెండు అత్యాధునిక సీ-17 (C-17) గ్లోబ్‌మాస్టర్ భారీ రవాణా విమానాలు అత్యవసర వస్తువులతో వెనిజులాకు పయనమయ్యాయి. ఈ విమానాల్లో దాదాపు 35 టన్నులకు పైగా బరువైన అత్యవసర సహాయక సామాగ్రిని తరలిస్తున్నారు. ఇందులో విపత్తు సమయాల్లో ప్రాణాలు రక్షించే అత్యవసర మందులు (లైఫ్ సేవింగ్ డ్రగ్స్), ప్రాథమిక చికిత్సా సామాగ్రి , అత్యాధునిక వైద్య పరికరాలు ఉన్నాయి. భూకంప ప్రభావిత ప్రాంతాల్లోని బాధితులకు తక్షణమే వైద్య సాయం అందేలా ఈ లోడ్‌ను భారత్ వేగంగా రవాణా చేస్తోంది.

Operation Amistad | భీష్ (BHISHM) క్యూబ్స్..
భూకంపం కారణంగా స్థానిక ఆసుపత్రులు దెబ్బతిన్న తరుణంలో, క్షేత్రస్థాయిలోనే అధునాతన చికిత్స అందించేందుకు భారత సైన్యం ప్రత్యేక వ్యూహంతో ముందుకు సాగుతోంది. విపత్తు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు భారత సైన్యానికి చెందిన ఒక ప్రత్యేక ఫీల్డ్ హాస్పిటల్ యూనిట్‌ను రంగంలోకి దించారు. అత్యవసర పరిస్థితుల్లో క్షతగాత్రులకు అక్కడికక్కడే సర్జరీలు, ప్రాథమిక , అధునాతన అత్యవసర చికిత్స అందించే సామర్థ్యమున్న రెండు మొబైల్ ఆసుపత్రి టెంట్లు (BHISHM Cubes) ను భారత్ పంపించింది. విపత్కర వాతావరణంలో సైతం ఎటువంటి ఇబ్బంది లేకుండా కేవలం కొద్ది నిమిషాల్లోనే వీటిని ఏర్పాటు చేసి వైద్య సేవలు ప్రారంభించవచ్చు. బాధితులను సకాలంలో ఆదుకోవడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి.
Operation Amistad underway!
Two @IAF_MCC C17s took-off today for Venezuela with urgent assistance to support their post-earthquake relief efforts.
The assistance contains an Indian Army @adgpi Field Hospital Unit and over 35 tons of relief supplies, medicines and medical… pic.twitter.com/Dcq8P065tp
— Dr. S. Jaishankar (@DrSJaishankar) June 26, 2026
ఇది కూడా చదవండి: Special Intensive Revision | ఓటర్ల జాబితా ఇక పక్కా.. ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాల్లోకి ‘SIR’