అక్షరటుడే వెబ్‌డెస్క్: Swarna Gramam Employees | విజయవాడలో ‘స్వర్ణ గ్రామం’, ‘స్వర్ణ వార్డు’ ఉద్యోగులు చేపట్టిన ఆందోళనల పట్ల ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh )ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ నిబంధనలను ధిక్కరించి నిరసనలకు దిగిన వారిపై కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమైంది.
Swarna Gramam Employees | 46 మందికి షోకాజ్ నోటీసులు..
ఈ నిరసనల్లో అత్యంత కీలకంగా వ్యవహరించి, ఆందోళనలను ముందుకు నడిపించిన 46 మంది ఉద్యోగులను ప్రభుత్వం గుర్తించింది. వీరికి వెంటనే షోకాజ్ నోటీసులు జారీ చేయాలని సంబంధిత జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ఆ నోటీసులకు వారు ఇచ్చే వివరణ ఆధారంగా తదుపరి కఠినమైన శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నారు.
Swarna Gramam Employees | క్రిమినల్ కేసులు..
నిరసనల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, ఈ ఘటనకు బాధ్యులైన పలువురు ఉద్యోగులను ఇప్పటికే సస్పెండ్ చేసినట్లు సమాచారం ఉంది. అలాగే ప్రభుత్వ కార్యకలాపాలకు విఘాతం కలిగించి, ఆంక్షలు , నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను ఆందోళనకారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు విజయవాడ పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రభుత్వ విధుల్లో ఉండి నిబంధనలు అతిక్రమిస్తే సహించేది లేదనే కఠిన సంకేతాలను ప్రభుత్వం స్పష్టంగా ఇస్తోంది.
ఇది కూడా చదవండి: Medical College Workers | మెడికల్ కళాశాలలో కార్మికుల సమస్యలు పరిష్కరించాలి