అక్షరటుడే వెబ్‌డెస్క్: Child Care Leave | ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు సంబంధించి జాతీయ మహిళా కమిషన్ (NCW) కేంద్ర ప్రభుత్వానికి ఒక కీలక సిఫార్సు చేసింది. శిశు సంరక్షణ సెలవులను (Child Care Leaves) కేవలం తల్లులకే కాకుండా, తల్లిదండ్రులిద్దరికీ దశలవారీగా అమలు చేయాలని సూచించింది.
Child Care Leave | 730 రోజుల సెలవుల పంపిణీ..
శిశు సంరక్షణ కోసం కేటాయించే మొత్తం 730 రోజుల సెలవులను తల్లి, తండ్రి ఇద్దరూ పంచుకునేలా అవకాశం కల్పించాలని కమిషన్ సిఫార్సు చేసింది. ఈ సెలవులను లింగ తటస్థంగా మార్చి, ఇద్దరూ చెరో 365 రోజుల చొప్పున తీసుకోవడానికి లేదా 60:40 నిష్పత్తిలో పంచుకోవడానికి వెసులుబాటు కల్పించాలని తెలిపింది. ప్రస్తుతం ఈ సెలవులు కేవలం మహిళలకే ఉండటం వల్ల బాధ్యతంతా వారిపైనే పడుతోందని పేర్కొంది.
Child Care Leave | దశలవారీ అమలు..
ఈ కొత్త విధానాన్ని మొదట భారీ పరిశ్రమల్లో ప్రవేశపెట్టి, ఆ తర్వాత మధ్య, చిన్న తరహా పరిశ్రమలకు, అలాగే అసంఘటిత , గిగ్ వర్కర్లకు విస్తరించాలని సూచించింది. దీన్ని అమలు చేసే యాజమాన్యాలకు పన్ను రాయితీలు, ఆర్థిక ప్రోత్సాహకాలు అందించాలని, దీనికోసం ప్రభుత్వం, యాజమాన్యాలు, ఉద్యోగుల భాగస్వామ్యంతో సంయుక్త నిధిని ఏర్పాటు చేయవచ్చని వెల్లడించింది.
ఇది కూడా చదవండి: Medical College Workers | మెడికల్ కళాశాలలో కార్మికుల సమస్యలు పరిష్కరించాలి