అక్షరటుడే వెబ్‌డెస్క్: Venezuela Earthquake | దక్షిణ అమెరికా దేశమైన వెనిజులాలో ( Venezuela ) ఈ నెల 24న వరుసగా రెండు భారీ భూకంపాలు సంభవించాయి. ఈ విపత్తు ధాటికి వందలాది భవనాలు, అపార్ట్‌మెంట్లు నేలమట్టమయ్యాయి. స్థానిక ప్రభుత్వ అధికారిక గణాంకాల ప్రకారం, ఇప్పటివరకు 920 మంది ప్రాణాలు కోల్పోయారు. భూకంపం సంభవించి మూడు రోజులు గడుస్తున్నా, క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇంకా దారుణంగానే ఉన్నాయి.
Venezuela Earthquake | గల్లంతైన వారి సంఖ్య..
శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతుండగా, అంతర్జాతీయ వార్తా సంస్థలు వెల్లడించిన సమాచారం ప్రకారం ఏకంగా 51,000 మందికి పైగా ప్రజలు గల్లంతయ్యారు. కూలిపోయిన భారీ కట్టడాల శిథిలాల కింద వీరు చిక్కుకొని ఉండవచ్చని భావిస్తున్నారు.

Venezuela Earthquake | రెస్క్యూ ఆపరేషన్..
వందలాది విపత్తు నిర్వహణ బృందాలు రాత్రింబవళ్లు శ్రమిస్తూ, అత్యాధునిక పరికరాల సహాయంతో శిథిలాలను తొలగిస్తున్నాయి. సమయం గడుస్తున్న కొద్దీ శిథిలాల కింద ఉన్నవారు ప్రాణాలతో బయటపడే అవకాశాలు తగ్గుతుండటంతో బాధితుల కుటుంబీకులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. గాయపడిన వారికి తాత్కాలిక శిబిరాల్లో అత్యవసర వైద్య సేవలను అందిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Kukatpally Illegal Constructions | కూకట్‌పల్లిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత