SI Salute | కాంగ్రెస్ జెండాకు ఎస్సై సెల్యూట్..! ఆగహ్రం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే ప్రశాంత్​ రెడ్డి..

కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో మంగళవారం జరిగిన ఘటన రాజకీయ దుమారం రేపుతోంది. ఓ ఎస్సై కాంగ్రెస్​ పార్టీ జెండాకు సెల్యూట్​ చేశారంటూ ఎమ్మెల్యే ప్రశాంత్​ రెడ్డి మండిపడ్డారు.

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్: SI Salute | కామారెడ్డి జిల్లా గాంధారి (Gandhari) మండల కేంద్రంలో మంగళవారం జరిగిన ఘటన రాజకీయ దుమారం రేపుతోంది. కాంగ్రెస్​ పార్టీ జెండాకు సెల్యూట్​ చేశారనే ఆరోపణలు వివాదానికి దారి తీశాయి.

SI Salute | ఎమ్మెల్యే ప్రశాంత్​రెడ్డి తీవ్ర విమర్శలు..

కాంగ్రెస్ పార్టీ గాంధారి మండల కార్యాలయ ప్రారంభోత్సవంలో భాగంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ (MLA Madan Mohan) రావు పార్టీ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో గాంధారి (Gandhari Police) ఎస్సై మహేందర్ కాంగ్రెస్ నాయకులతో కలిసి పార్టీ జెండాకు సెల్యూట్ చేశారనే ఆరోపణలు రాజకీయ వర్గాలో తీవ్ర చర్చకు దారితీశాయి. ఇందుకు సంబంధిత ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎస్సై హోదాలో ఉంటూ విధి నిర్వహణను విస్మరించి ఒక రాజకీయ పార్టీ జెండాకు సెల్యూట్ చేయడం తీవ్ర అభ్యంతరకరమని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. తెలంగాణలో పోలీస్ వ్యవస్థ కాంగ్రెస్ పార్టీకి జేబు సంస్థగా మారిందని, పోలీసులు కాంగ్రెస్ తాబేదార్లుగా పని చేస్తున్నారని ఆయన విమర్శించారు.

SI Salute | డీజీపీ చర్యలు తీసుకోవాలి..

రాజకీయాలకు అతీతంగా విధులు నిర్వర్తించాల్సిన ప్రభుత్వ ఉద్యోగులను అధికార పార్టీ కార్యకర్తల్లా వ్యవహరించే పరిస్థితికి కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిందని ప్రశాంత్​రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు వ్యవస్థ నిష్పాక్షికతపై ప్రజల్లో అనుమానాలు కలిగేలా ఇటువంటి చర్యలు ఉన్నాయని వేముల అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వాన్ని ప్రశ్నించిన బీఆర్ఎస్ నాయకులపై అధికార పార్టీ ఆదేశాల మేరకు అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని, ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కేలా పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. గాంధారిలో జరిగిన ఘటనే దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర డీజీపీ వెంటనే విచారణ జరిపించి ఎస్సైపై తగిన చర్యలు తీసుకోవాలని వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

rakesh 1

ఇది కూడా చదవండి: డెలివరీ బాయ్​పై దాడి ఆరోపణలపై స్పందించిన అఖిల్ రాజ్ 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *