అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Additional Collector | జిల్లా (Nizamabad) అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ)గా కొనసాగిన కిరణ్ కుమార్ మంగళవారం ఉద్యోగ విరమణ చేశారు. ఈ సందర్భంగా ఆయనకు కలెక్టర్ ఇలా త్రిపాఠి(Collector Ila Tripathi) ఆధ్వర్యంలో ఘనంగా వీడ్కోలు పలికారు.
Additional Collector | అడిషనల్ కలెక్టర్(రెవెన్యూ)గా..
కిరణ్‌కుమార్ రిటైర్మెంట్ అయిన నేపథ్యంలో.. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా కొనసాగుతున్న వి.భుజంగరావుకు, అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ)గా అదనపు బాధ్యతలు అప్పగించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎంతో సమర్ధత కలిగిన అధికారి పదవీ విరమణ చేస్తుండటం జిల్లా యంత్రాంగానికి ఎంతో లోటు అని అన్నారు. తన మొదటి పోస్టింగ్ భద్రాద్రి జిల్లాలో ట్రెయినీ కలెక్టర్ గా ఇదివరకు కిరణ్ కుమార్‌తో కలిసి పని చేశానని కలెక్టర్ గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం తాను కలెక్టర్‌గా కొనసాగుతున్న నిజామాబాద్ జిల్లాలో ఆయన పదవీ విరమణ చేయడం కాకతాళీయం అన్నారు.

ఇది కూడా చదవండి: అమెరికా సుప్రీంకోర్టులో ట్రంప్‌కు షాక్