July 02 Gold Prices | ఆశలు చిగురింపజేస్తున్న పసిడి.. నేటి ధరలు ఎలా ఉన్నాయంటే!

రూపాయి-డాలర్ మారకపు విలువలో మార్పులు, దేశీయ డిమాండ్‌, బులియన్ మార్కెట్ ధోరణులు, జీఎస్టీ వంటి అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: July 02 Gold Prices | దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు నేడు స్వల్పంగా పెరిగాయి. నిన్నటితో పోలిస్తే గ్రాముకు రూ.1 చొప్పున పెరగడంతో కొనుగోలుదారులు తాజా ధరలపై దృష్టి సారించారు.

నేడు హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.14,078కు చేరగా, నిన్న ఇది రూ.14,077గా నమోదైంది. 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.12,905కు పెరగగా, నిన్న రూ.12,904గా ఉంది. అలాగే 18 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.10,559కు చేరగా, నిన్న రూ.10,558గా నమోదైంది.

Tryambakeswaram Amritakundam | కాలగర్భం నుంచి శంకరుడు కదిలి వచ్చాడా..? త్రయంబకేశ్వర అమృతకుండ రహస్యాలపై ప్రత్యేక శోధన!

July 02 Gold Prices | స్వల్ప హెచ్చుతగ్గులు

అంతర్జాతీయ బంగారం ధరల కదలికలు, రూపాయి-డాలర్ మారకపు విలువలో మార్పులు, దేశీయ డిమాండ్‌, బులియన్ మార్కెట్ ధోరణులు, జీఎస్టీ వంటి అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి. ఈ కారణంగా ధరల్లో రోజువారీ స్వల్ప హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

పెళ్లిళ్లు, శుభకార్యాలు, పెట్టుబడుల కోసం బంగారం కొనుగోలు చేయాలనుకునే వారు తాజా ధరలను పరిశీలించి నిర్ణయం తీసుకోవడం మంచిదని బులియన్ వ్యాపారులు సూచిస్తున్నారు.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *