అక్షరటుడే వెబ్‌డెస్క్: Kandi Gnaneshwar Arrest | శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ( Congress ) చెందిన సీనియర్ నాయకుడు కంది జ్ఞానేశ్వర్‌పై సంచలన ఆరోపణలు వెల్లువెత్తాయి. ఒక మహిళపై లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా, వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేసి లక్షల రూపాయలు వసూలు చేశారనే ఆరోపణలతో చందానగర్ పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.
Kandi Gnaneshwar Arrest | ఏం జరిగింది?
పోలీసుల కథనం ప్రకారం.. 2019లో భర్తను కోల్పోయిన గంగారం ప్రాంతానికి చెందిన ఒక మహిళతో, 2024లో కంది జ్ఞానేశ్వర్‌కు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం మొదట్లో స్నేహంగానే ఉన్నా, నిందితుడి ఉద్దేశం వేరేలా ఉందని బాధితురాలు ఆరోపిస్తోంది. ఒకరోజు ఆ మహిళకు ఇచ్చిన పానీయంలో మత్తుమందు కలిపిన నిందితుడు, ఆమె స్పృహ కోల్పోయిన తర్వాత లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ దుశ్చర్యను తన మొబైల్ ఫోన్‌లో వీడియో తీశాడు.
Kandi Gnaneshwar Arrest | బ్లాక్‌మెయిల్..
ఆ వీడియోలను చూపిస్తూ బాధితురాలిని నిందితుడు భయభ్రాంతులకు గురిచేశాడు. నగ్న వీడియోలను సోషల్ మీడియాలో పెడతానని, ఇతరులకు చూపిస్తానని బెదిరిస్తూ ఆమె నుంచి ఏకంగా రూ. 50 లక్షలు వసూలు చేశాడు. నిందితుడి వేధింపులు రోజురోజుకూ పెరిగిపోవడంతో, ఇక భరించలేని బాధితురాలు ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించింది.
Kandi Gnaneshwar Arrest | పోలీసుల చర్య..
బాధితురాలి ఫిర్యాదును అత్యంత తీవ్రంగా పరిగణించిన చందానగర్ పోలీసులు, వెంటనే రంగంలోకి దిగారు. ఆమె స్టేట్‌మెంట్ ఆధారంగా కేసు నమోదు చేసి, కంది జ్ఞానేశ్వర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతడిని రిమాండ్‌కు తరలించినట్లు సమాచారం. ఈ ఘటన ఇప్పుడు శేరిలింగంపల్లి రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఇది కూడా చదవండి: Fake Mutton Hyderabad | తక్కువ ధరకు మటన్ కొంటున్నారా.. ఈ విషయం తెలిస్తే షాక్ అవుతారు