Amarnath Yatra 2026 | ప్రారంభమైన అమర్‌నాథ్ యాత్ర..భక్తులకు ప్రధాని మోడీ కీలక సందేశం

నేటి నుంచి అమర్‌నాథ్ యాత్ర ప్రారంభమైంది. బాబా బర్ఫానీ దర్శనం కోసం దేశ విదేశాల నుండి లక్షలాది మంది శివభక్తులు తరలివస్తుండగా, ఈ పవిత్ర యాత్రపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక లేఖ రాశారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Amarnath Yatra 2026 | నేటి నుంచి అమర్‌నాథ్ యాత్ర ప్రారంభమైంది. బాబా బర్ఫానీ దర్శనం కోసం దేశ విదేశాల నుండి లక్షలాది మంది శివభక్తులు తరలివస్తుండగా, ఈ పవిత్ర యాత్రపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక లేఖ రాశారు. అమర్‌నాథ్ యాత్ర మన దేశ సాంస్కృతిక ఐక్యతకు నిదర్శనమని పేర్కొన్న ప్రధాని, భక్తుల కోసం ఐదు కీలక సంకల్పాలను పాటించాలని పిలుపునిచ్చారు. ప్రతి సంవత్సరం ఎంతో కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో సాగే ఈ యాత్రను విజయవంతం చేసేందుకు భారత సైన్యం, సీఆర్‌పీఎఫ్, జమ్మూ-కశ్మీర్ పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది చేస్తున్న సేవలను ప్రధాని కొనియాడారు. యాత్రికులకు అండగా నిలుస్తున్న స్థానిక పౌరుల నిస్వార్థ గుణాన్ని ఆయన ప్రశంసించారు.

Amarnath Yatra 2026 | యాత్రికులు పాటించాల్సినవి..

అమర్‌నాథ్ యాత్రను కేవలం ఒక ఆధ్యాత్మిక ప్రయాణంగానే కాకుండా, దేశాభివృద్ధికి దోహదపడేలా మలచుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ భక్తులకు పిలుపునిచ్చారు. ఈ యాత్రలో భాగంగా భక్తులు పవిత్ర మార్గంలో పరిశుభ్రతను పాటిస్తూ స్వచ్ఛతను కాపాడాలని, భద్రతా సిబ్బంది సూచనలను గౌరవిస్తూ క్రమశిక్షణతో వ్యవహరించాలని ఆయన కోరారు.

Amarnath Yatra 2026 | ఏక్ పేడ్ మా కే నామ్..

ముఖ్యంగా స్థానిక జమ్మూ-కశ్మీర్ యువతకు ఉపాధి కల్పించే దిశగా, భక్తులు తమ యాత్ర ఖర్చులో కనీసం 10 శాతం నిధులను స్థానిక ఉత్పత్తుల కొనుగోలుకు కేటాయించాలని సూచించారు. అలాగే, పర్యావరణ పరిరక్షణలో భాగంగా ‘ఏక్ పేడ్ మా కే నామ్’ ప్రచారంతో తోబుట్టువులకు మొక్కలను బహుమతిగా ఇవ్వాలని, ‘నేషన్ ఫస్ట్’ అనే స్ఫూర్తితో ‘వికసిత భారత్’ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. బాబా బర్ఫానీ దీవెనలతో భక్తులందరి ప్రయాణం సురక్షితంగా, ఆధ్యాత్మికంగా సాగాలని ప్రధాని ఆకాంక్షించారు.


ఇది కూడా చదవండి:  Russia Drone Attack | కీవ్‌పై రష్యా డ్రోన్ల దాడి..

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *