Ayodhya Ram Mandir | అయోధ్య రామ మందిరంలో చోరీపై స్పందించిన ఆర్​ఎస్ఎస్

అయోధ్య రామమందిరంలో విరాళాల చోరీ ఘటనపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆందోళన వ్యక్తం చేసింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Ayodhya Ram Mandir | అయోధ్యలోని రామమందిరంలో విరాళాల పెట్టెల నుంచి సొమ్ము చోరీకి గురైన ఘటనపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘటనను “అత్యంత బాధాకరం”గా పేర్కొన్న ఆ సంస్థ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది.

అయోధ్యలో విరాళాల చోరీపై ఆర్​ఎస్​ఎస్​ శుక్రవారం తొలిసారి స్పందించింది. ఆలయ నిర్వహణలో మరింత పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలని సూచించింది. శ్రీ రామ జన్మభూమిలోని ఈ భారీ ఆలయం తరతరాల భక్తుల త్యాగాలు, అంకితభావం ద్వారా హిందూ సమాజానికి విశ్వాసం, భక్తికి ప్రతీకగా నిలిచిందని ఆర్​ఎస్​ఎస్​ సర్​ కార్​వ్యాహ దత్తాత్రేయ హోసబలే పేర్కొన్నారు. చోరీ ఘటన రామ భక్తుల మనోభావాలను, విశ్వాసాన్ని తీవ్రంగా గాయపరిచిందన్నారు.

Ayodhya Ram Mandir | కఠిన శిక్ష పడాలి

శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అభ్యర్థన మేరకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసిందని దత్తాత్రేయ అన్నారు. దర్యాప్తులో దోషులుగా తేలిన వారికి కఠిన శిక్ష పడాలని ఆయన అన్నారు. ఈ ఘటనను ఒక ప్రత్యేకమైన అంశంగా పరిగణించి, ఆలయ నిర్వహణ, కార్యకలాపాల వ్యవస్థలలో ఏవైనా లోపాలు ఉంటే వాటిని సరిదిద్దాలని కోరారు. అయోధ్య ఆలయంపై లక్షలాది మంది భక్తులకు ఉన్న విశ్వాసం చెక్కుచెదరకుండా చూడటం, ఈ ఘటన చుట్టూ నెలకొన్న అనిశ్చితికి ముగింపు పలకడం చాలా అవసరమని ఆయన అన్నారు.

Ayodhya Ram Mandir |   సంయమనం పాటించాలి

rss

శాంతిని కోరుతూ, దర్యాప్తు జరుగుతున్నంత కాలం సంయమనం, సహనం పాటించాలని RSS హిందూ సమాజానికి విజ్ఞప్తి చేసింది. ఈ దురదృష్టకర సంఘటనను ఆసరాగా చేసుకుని హిందూ ధర్మాన్ని, సమాజాన్ని అప్రతిష్టపాలు చేయాలని చూస్తున్న హిందూ వ్యతిరేక, దేశ వ్యతిరేక శక్తుల కుట్రలను భగ్నం చేయాలని పేర్కొంది.

దీనిని కూడా చదవండి : Rythu Bharosa Funds | రైతులకు తీపి కబురు..5 ఎకరాల వారికి రైతు భరోసా నిధుల విడుదల

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *