అక్షరటుడే: బోధన్ : Hotel Inspections | పట్టణంలోని (Bodhan Municipality) పలు హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లపై మున్సిపల్ అధికారులు దాడులు చేశారు. ఈ సందర్భంగా శుభ్రత పాటించని హోటళ్లకు (Hotel Inspections) జరిమానాలు విధించారు..
Hotel Inspections | మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో..
బోధన్ మున్సిపల్(Municipal Commissioner) కమిషనర్ జాదవ్ కృష్ణ ఆధ్వర్యంలో హోటళ్లు, బేకరీల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పరిశుభ్రత నిబంధనలు పాటించని గాయత్రి టిఫిన్ సెంటర్, అరోమా హోటల్, గణేష్ ఇడ్లీ సెంటర్, ఏషియన్ బేకరీలకు రూ.500 చొప్పున బావర్చి హోటల్‌కు రూ.1000 జరిమానా విధించారు. పరిశుభ్రత పాటించడంతో పాటు ప్లాస్టిక్ వినియోగం మానుకోవాలని, లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పట్టణ పరిధిలో అధికారుల ఆధ్వర్యంలో నిరంతర పర్యవేక్షణ ఉంటుందన్నారు. ప్రజలు సైతం ప్లాస్టిక్ వినియోగానికి దూరంగా ఉండాలని కోరారు. జూట్ బ్యాగ్‌లను ఎక్కువగా వాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు గణేష్, దత్తారావు తదితరులు పాల్గొన్నారు.