అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Pawan Khera | అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ సతీమణి ఫిర్యాదుపై నమోదైన ఎఫ్ఐఆర్లో కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరాకు గౌహతి హైకోర్టు ముందస్తు బెయిల్‌ను నిరాకరించింది. ఆయన పిటిషన్‌ను శుక్రవారం కోర్టు కొట్టివేసింది.
పవన్ ఖేరా ఏప్రిల్ 4న జరిగిన ప్రెస్ మీట్‌లో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ (Assam CM Himanta Biswa Sarma) సతీమణి రినికి భుయాన్ శర్మపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆమె మూడు దేశాల పాస్‌పోర్టులు కలిగి ఉన్నారని, దుబాయ్‌లో అక్రమ ఆస్తులు ఉన్నాయని ఆరోపించారు. దీనిపై ఆమె అస్సాం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి పవన్ ఖేరా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన కోర్టు ఏప్రిల్ 10న వారం రోజుల పాటు ముందస్తు బెయిల్ ఇచ్చింది.
Pawan Khera | సుప్రీంకోర్టులో పిటిషన్
తెలంగాణ హైకోర్టు (Telangana High Court) తెలంగాణ హైకోర్టు)తీర్పుపై అస్సాం పోలీసులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఏప్రిల్ 15న సుప్రీంకోర్టు తన మధ్యంతర ఉత్తర్వులో, తెలంగాణ హైకోర్టు మంజూరు చేసిన ట్రాన్సిట్ ముందస్తు బెయిల్‌పై స్టే విధించింది. అలాగే ముందస్తు బెయిల్ కోసం అస్సాంలోని గౌహతి హౌకోర్టును ఆశ్రయించాలని సూచించింది. దీంతో ఖేరా గౌహతి కోర్టు (Khera Guwahati Court)లో పిటిషన్ వేశారు. దీనిపై వాదనలు విన్న ధర్మాసనం తీర్పును శుక్రవారం ఉదయం వెలువరించింది. ఆయన బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది.
Pawan Khera | రాజకీయ కక్ష సాధింపు
ఖేరా తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. ఖేరాపై ముఖ్యమంత్రి ఆరోపణలను ప్రస్తావిస్తూ, ముఖ్యంగా రాబోయే ఎన్నికల నేపథ్యంలో ఆయన చర్య రాజకీయ కక్ష సాధింపు చర్యలా ఉందని వాదించారు. ఖేరా పారిపోయే ప్రమాదం లేదని, ఆయన అరెస్టు అవసరం లేదని వాదించారు. అస్సాం అడ్వకేట్ జనరల్ దేవాజిత్ లోన్ సైకియా ఖేరాకు ఉపశమనం కల్పించడాన్ని వ్యతిరేకించారు. ఇది కేవలం సాధారణ పరువు నష్టం కేసు కాదని, ఈ విషయంలో పత్రాలు, టైటిల్ డీడ్‌ల తయారీ ఇమిడి ఉందని ఆయన సమర్పించారు. ఇందులోని ప్రధాన నేరాలు మోసం, ఫోర్జరీ అని జోడించారు. దీంతో కోర్టు ఖేరా బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది.
ఇది కూడా చదవండి..: Telangana RTC Strike 2 | ఆర్టీసీ డ్రైవర్ మృతితో రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్తతలు.. అక్కడ బంద్‌కు పిలుపు

