అక్షరటుడే, డిచ్పల్లి: Women Empowerment Telangana | రూరల్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ, మహిళా సాధికారతే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని ఎమ్మెల్యే భూపతి రెడ్డి (MLA Bhupathi Reddy) అన్నారు. నిజామాబాద్ రూరల్(Nizamabad Rural) మండలం ఆకుల కొండూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని అశోక్ ఫారంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు.
Women Empowerment Telangana | మహిళా సంఘం భవనం.. ఫంక్షన్ హాల్..
ఆకుల కొండూర్లోని(Akula Kondur) గ్రామంలో రూ.10లక్షల వ్యయంతో మహిళా సంఘ భవనం నిర్మాణం, రూ.5లక్షలతో వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఫంక్షన్ హాల్, కొండూర్ గ్రామంలో రూ.10 లక్షలతో చేపట్టనున్న అంతర్గత సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా మరింత బలోపేతం కావాలనే సంకల్పంతో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.
మహిళా సంఘాలకు శాశ్వత వసతులు కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తుండగా, రాష్ట్రంలోనే అత్యధికంగా 132 మహిళా సంఘ భవనాలు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో నిర్మిస్తుండటం గర్వకారణమన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం విశ్వాసాన్ని నిలబెట్టుకుంటోందని పేర్కొన్నారు.
Women Empowerment Telangana | మాటలకు పరిమితం కాకుండా..
గత ప్రభుత్వాల మాదిరిగా కేవలం మాటలకే పరిమితం కాకుండా, ప్రతి గ్రామానికి అభివృద్ధి పనులు తీసుకెళ్లి ప్రజల జీవితాల్లో స్పష్టమైన మార్పు తీసుకురావడమే తమ లక్ష్యమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు, మహిళా సంఘ భవనాలు, కమ్యూనిటీ హాళ్లు, తాగునీరు, విద్య, వైద్యం వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. మహిళల స్వయం ఉపాధి, స్వావలంబన, ఆర్థిక అభివృద్ధికి మహిళా సంఘ భవనాలు కేంద్రాలుగా మారనున్నాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర గీత పారిశ్రామిక సహకార కార్పొరేషన్ ఛైర్మన్ చంద్రశేఖర్ గౌడ్, ఏఎంసీ ఛైర్మన్ ముప్ప గంగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జనార్ధన్, నాయకులు పొలసాని శ్రీనివాస్, కార్పొరేటేటర్ అగ్గు భోజన్న, ఉమ్మాజి నరేష్, కుమార్ రెడ్డి, మోహన్, హన్మాండ్లు, రాజు, కిరణ్, భాస్కర్ రెడ్డి, నాశెట్టి సుమన్ కుమార్, రాజలింగం, స్థానిక సర్పంచ్ శారద-సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: 48 గంటల్లో రేషన్ కార్డు: పొన్నం