Dhurandhar 2 | 138 ‘ధురంధర్ 2’ బ్లాక్‌బస్టర్ దూకుడు.. ‘బాహుబలి 2’ రికార్డ్ బ్రేక్, ‘దంగల్’ రికార్డులు అంద‌ని ద్రాక్షే!

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Dhurandhar 2 | బాలీవుడ్‌కు  ఊపిరి పోసిన చిత్రంగా దర్శకుడు ఆదిత్య ధర్ (Director Aditya Dhar) తెరకెక్కించిన రణవీర్ సింగ్ నటించిన ‘ధురంధర్ 2’ నిలిచింది. చాలా కాలంగా భారీ బ్లాక్‌బస్టర్ కోసం ఎదురుచూస్తున్న హిందీ చిత్రసీమకు ఈ సినిమా పెద్ద రిలీఫ్ ఇచ్చింది.

బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా చూపించిన దూకుడు చూసి, ప్రపంచ రికార్డులను సైతం బద్దలు కొడుతుందని అంతా భావించారు. ఈ క్ర‌మంలోనే ‘ధురంధర్ 2’ ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.1812 కోట్ల వసూళ్లు సాధించింది. ఈ క్ర‌మంలో , ప్రభాస్ హీరోగా ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి 2’ (రూ.1810 కోట్లు) రికార్డ్‌ని తిర‌గ‌రాసింది. అయితే ఆమిర్ ఖాన్ నటించిన ‘దంగల్’ (రూ.2070.3 కోట్లు) రికార్డులను దాటలేకపోయింది.

Dhurandhar 2 | బాహుబ‌లి రికార్డ్ బ్రేక్…

ఈ పరిస్థితికి పలు కారణాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా ‘దంగల్’ సినిమా చైనాలో సాధించిన భారీ వసూళ్లు కీలక పాత్ర పోషించాయి. ఆ చిత్రం కేవలం చైనాలోనే రూ.1300 కోట్లకు పైగా వసూలు చేయడం విశేషం. అయితే ‘ధురంధర్ 2’కు చైనా మార్కెట్‌లో అటువంటి అవకాశం లభించలేదు. అంతేకాకుండా గల్ఫ్ దేశాల్లో (Gulf countries) ఈ సినిమాపై నిషేధం విధించబడటంతో అక్కడి వసూళ్లు పూర్తిగా కోల్పోయింది. గల్ఫ్‌లో విడుదలైతే అదనంగా రూ.100 కోట్ల వరకు వచ్చే అవకాశం ఉండేదని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.ఇక దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా అంచనాలకు తగ్గ స్థాయిలో వసూళ్లు సాధించలేకపోయింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైనప్పటికీ పెద్దగా స్పందన రాలేదు. తెలుగు వెర్షన్ ద్వారా రూ.42.56 కోట్లు, తమిళం నుంచి రూ.19.39 కోట్లు, కన్నడ నుంచి రూ.3.66 కోట్లు, మలయాళం నుంచి రూ.1.77 కోట్లు మాత్రమే రాబట్టింది. దీనితో పోలిస్తే ‘బాహుబలి 2’, ‘ఆర్ఆర్ఆర్’, ‘పుష్ప 2’ వంటి పాన్ ఇండియా చిత్రాలు దక్షిణాది రాష్ట్రాల్లోనే వందల కోట్ల వసూళ్లు సాధించాయి.

మరో ముఖ్యమైన అంశం సెన్సార్ సర్టిఫికేట్. ‘ధురంధర్ 2’ (Dhurandhar 2) సినిమాకు ‘A’ సర్టిఫికేట్ లభించడం వల్ల కుటుంబ ప్రేక్షకులు కొంతమేర దూరమయ్యారు. 18 ఏళ్లకు పైబడినవారికే పరిమితమవడంతో కలెక్షన్లపై ప్రభావం పడింది. అదనంగా సినిమా నిడివి 3 గంటల 49 నిమిషాలు ఉండటం, ఎక్కువ వయలెన్స్ ఉండటంతో కొంతమంది ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లడానికి ఆసక్తి చూపలేదని టాక్ వినిపిస్తోంది. అయితే ఈ సినిమా ఇంకా థియేట‌ర్స్‌లో ఉన్న నేప‌థ్యంలో రానున్న రోజుల‌లో రెండు వేల కోట్ల మార్క్‌కి చేరుకోవ‌డం ఖాయం అంటున్నారు.

ఇది కూడా చదవండి..: Michael Biopic | అల్లు సినిమాస్‌లో ‘మైఖేల్’ స్పెషల్ షో.. అభిమాన స్టార్ బయోపిక్‌ను సెలబ్రేట్ చేసిన అల్లు అర్జున్

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *