అక్షరటుడే, ఇందూరు: Mental Health Services | జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో మానసిక ఆరోగ్య సేవలను విస్తరించాలని ప్రభుత్వ వైద్య కళాశాల(Medical College) ప్రిన్సిపాల్ కృష్ణ మోహన్ అన్నారు. వైద్య కళాశాల, జీజీహెచ్ మానసిక వైద్య విభాగం (Nizamabad GGH) ఆధ్వర్యంలో మానసిక ఆరోగ్యంపై విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని జీజీహెచ్లో మంగళవారం నిర్వహించారు.
Mental Health Services |చురుకుగా పాల్గొనాలి..
కృష్ణమోహన్ మాట్లాడుతూ.. సైకియాట్రీ పీజీ విద్యార్థులు, ఎంబీబీఎస్ విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించే మానసిక ఆరోగ్య అవగాహన శిబిరాలు, మత్తు పదార్థాల నివారణ (డ్రగ్ డీ-అడిక్షన్) అవగాహన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలన్నారు. గ్రామీణ ప్రజల్లో మానసిక వ్యాధులు, మత్తు పదార్థాల వ్యసనంపై ఉన్న అపోహలను తొలగించడం, ముందస్తు గుర్తింపు, చికిత్సకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన సూచించారు. విద్యార్థుల్లో మానసిక ఆరోగ్యం పట్ల అవగాహన, సృజనాత్మకత, సామాజిక బాధ్యతను పెంపొందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు.
ఎంబీబీఎస్, నర్సింగ్ విద్యార్థుల కోసం పోస్టర్, వ్యాస రచన పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ ఎల్. రాములు గౌరవ అతిథిగా హాజరై విద్యార్థులు సేవలను అభినందించారు. కార్యక్రమాన్ని మానసిక వైద్య విభాగాధిపతి ప్రొఫెసర్ విశాల్ అకుల(Akula Vishal) ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ ప్రొఫెసర్లు ప్రదీప్, రమణ, అరుణ్ పాల్గొన్నారు.
