Amit Shah | దీదీ ఇంటికి.. బీజేపీ అధికారంలోకి : అమిత్ షా

Balla Sandeep Kumar

అక్షరటుడే, కోల్‌కతా: Amit Shah | పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో పెను మార్పు రాబోతోందని, తొలి దశ ఎన్నికలతోనే బీజేపీ (BJP) విజయం ఖరారైపోయిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. కోల్‌కతాలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బెంగాల్ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని స్పష్టం చేశారు.

Amit Shah | అమిత్ షా ధీమా:

మొదటి విడతలో పోలింగ్ జరిగిన 152 స్థానాలకు గాను, బీజేపీ ఏకంగా 110 కంటే ఎక్కువ సీట్లను గెలుచుకోబోతోందని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు.

ఓటింగ్ శాతమే నిదర్శనం: “బెంగాల్ ప్రజలు ఫస్ట్ ఫేజ్‌లోనే తమ భవిష్యత్తును నిర్ణయించుకున్నారు. రికార్డు స్థాయిలో నమోదైన ఓటింగ్ శాతమే ఇందుకు నిదర్శనం” అని ఆయన పేర్కొన్నారు.

దీదీకి ఇక సెలవు: “దీదీ (Mamata Banerjee) ఇంటికి వెళ్లే సమయం ఆసన్నమైంది.. బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం” అంటూ అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. మోదీ (PM Modi) నాయకత్వంలోని అభివృద్ధి వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారని ఆయన వివరించారు.

ఇది కూడా చదవండి..: IRCTC Package | పూరీ, కాశీ, అయోధ్య దర్శనాలు.. ఐఆర్‌సీటీసీ మరో ఆధ్యాత్మిక ప్యాకేజీ

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *