Kathua Terror Hideout | కథువాలో ఉగ్రవాదుల స్థావరం ఛేదించిన భద్రతా బలగాలు.. రెండు హ్యాండ్ గ్రెనేడ్లు స్వాధీనం

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Kathua Terror Hideout | జమ్మూ–కశ్మీర్‌లోని కథువా జిల్లాలో భద్రతా బలగాలు ఉగ్రవాదుల రహస్య స్థావరాన్ని ఛేదించి రెండు హ్యాండ్ గ్రెనేడ్లను స్వాధీనం చేసుకున్నాయి. బుధవారం బిల్లావర్ ఎగువ ప్రాంతంలో ఈ స్థావరాన్ని గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు.

Kathua Terror Hideout | ఉగ్రవాదుల చొరబాటుకు సహకారం

జులై 2న అరెస్టు అయిన ఓవర్‌గ్రౌండ్ వర్కర్ (ఓజీడబ్ల్యూ) హాజీ లతీఫ్ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ ఆపరేషన్ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. రబాఘ్‌కు చెందిన హాజీ లతీఫ్ గత కొన్ని సంవత్సరాలుగా సరిహద్దు అవతలి నుంచి 12 మందికిపైగా ఉగ్రవాదులు భారత భూభాగంలోకి చొరబడేందుకు సహకరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.

Shopian Encounter | కశ్మీర్​లో ఎన్​కౌంటర్​.. లష్కర్ ఏ తోయిబా ఉగ్రవాది హతం

Kathua Terror Hideout | బిల్లావర్ ఎగువ ప్రాంతంలో..

ప్రస్తుతం హాజీ లతీఫ్‌ను జమ్మూ–కశ్మీర్ పోలీసులు, ఇతర భద్రతా సంస్థలు సంయుక్తంగా విచారిస్తున్నాయి. విచారణలో లభించిన సమాచారం ఆధారంగా బిల్లావర్ ఎగువ ప్రాంతంలో సోదాలు నిర్వహించగా ఉగ్రవాదుల స్థావరాన్ని గుర్తించి రెండు హ్యాండ్ గ్రెనేడ్లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి, ఉగ్రవాద నెట్‌వర్క్‌కు సంబంధించిన ఇతర వివరాలను వెలికితీసేందుకు దర్యాప్తు కొనసాగుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *