Cylinders Floating | గ్యాస్ ప్లాంట్​లోకి వరద.. కొట్టుకుపోయిన 3 వేల సిలిండర్లు

మహారాష్ట్రలో భారీ వర్షాలకు గ్యాస్​ ప్లాంట్​లోకి వరద వచ్చింది. దీంతో 3 వేల సిలిండర్లు కొట్టుకుపోయాయి.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Cylinders Floating | మహారాష్ట్ర (Maharashtra)లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. రాయఘడ్ ప్రాంతంలోని పాతాళగంగ వద్ద ఉన్న HPCL బాట్లింగ్ ప్లాంట్లోకి వరద నీరు రావడంతో ప్రహరీ కూలిపోయింది. దీంతో 3 వేల సిలిండర్లు కొట్టుకుపోయాయి.

Cylinders Floating | రక్షణ గోడ కూలిపోవడంతో

భారీ వర్షాల కారణంగా ప్లాంట్ రక్షణ గోడ కూలిపోవడంతో వరద నీరు నేరుగా ప్రాంగణంలోకి ప్రవేశించిందని అధికారులు తెలిపారు. దీనివల్ల సిలిండర్లు కొట్టుకుపోయి పాతాళగంగ నది, ఖార్పడా క్రీక్‌ (వాగు)లో పడ్డాయి. తేలుతున్న సిలిండర్లను చూసి ఆశ్చర్యపోయిన ప్రజలు, వంతెన పైనుండి వీడియో తీశారు. ఈ వీడియోలు సోషల్​ మీడియాలో వైరల్​ అవుతున్నాయి. కొందరు ప్రజలు సిలిండర్లను పట్టుకొని తీసుకెళ్లారు. నదిలోకి కొట్టుకుపోయిన సిలిండర్లలో కొన్ని గ్యాస్‌తో నిండి ఉండవచ్చని యంత్రాంగం పేర్కొంది.

Cylinders Floating | అధికారులకు అప్పగించాలి

Cylinders Floating

నదిలో, సమీప ప్రాంతాల్లో తేలుతున్న ఈ గ్యాస్ సిలిండర్లు ఎవరికైనా కనిపిస్తే, వాటిని వెంటనే సంబంధిత అధికారులకు లేదా కంపెనీకి అప్పగించాలని రాయ్‌గఢ్ కలెక్టర్ కిషన్ జవ్లే ప్రజలకు కోరారు. భద్రతా కారణాల దృష్ట్యా, ప్రజలు ఈ సిలిండర్లను తమ ఇళ్లలో ఉంచుకోవద్దని, వీలైనంత త్వరగా వాటిని యంత్రాంగానికి లేదా కంపెనీకి అప్పగించడంలో సహకరించాలన్నారు. నదిలోకి కొట్టుకుపోయిన సిలిండర్లలో గ్యాస్ ఉందో లేదో లేదా అవి సురక్షితమైన స్థితిలో ఉన్నాయో లేదో చెప్పలేమన్నారు. కుతూహలంతో, వినియోగం కోసం వాటిని పట్టుకొని తీసుకెళ్లడం అత్యంత ప్రమాదకరం అన్నారు.


ఇది కూడా చదవండి..: Train Honeymoon Setup | కొత్తజంట కోసం ట్రైన్​లో హనీమూన్​ సెటప్​.. రైల్వే శాఖ ఆగ్రహం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *