Modi Warning | ఆ ఫైళ్లన్నీ ఓపెన్ చేస్తాం.. దోషులకు శిక్ష తప్పదు: మోదీ

Balla Sandeep Kumar

అక్షరటుడే, కోల్‌కతా : Modi Warning | పశ్చిమ బెంగాల్‌ (West Bengal)లో టీఎంసీ సాగిస్తున్న అరాచక పాలనకు ముగింపు పలికే సమయం ఆసన్నమైందని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) అన్నారు. దమ్ దమ్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఆయన, తృణమూల్ కాంగ్రెస్ శ్రేణులకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. మే 4న వెలువడబోయే ఫలితాలు బెంగాల్ రాజకీయాల్లో కొత్త అధ్యాయాన్ని లిఖిస్తాయని స్పష్టం చేశారు.

Modi Warning | టీఎంసీ గూండాలు

ఎన్నికల ఫలితాల తర్వాత టీఎంసీ గూండాలు ఎక్కడా దాక్కోలేరని, వారిని ఎవరూ కాపాడలేరని మోదీ హెచ్చరించారు. బెంగాల్ ప్రజలపై జరిగిన ప్రతి అన్యాయానికి, అరాచకానికి సంబంధించిన ఫైళ్లను బయటకు తీస్తామని, దోషులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.

“టీఎంసీ అరాచక శక్తుల నుంచి ప్రజలకు విముక్తి కలిగిస్తాం.. ఇది మోదీ గ్యారంటీ” అంటూ భరోసా ఇచ్చారు. బెంగాల్‌లో సాగుతున్న జంగిల్ రాజ్‌ ముగిసిపోతోందని, తొలి దశలో నమోదైన రికార్డు పోలింగే దీనికి నిదర్శనమని ప్రధాని పేర్కొన్నారు. కాగా బెంగాల్​లో ఈ నెల 23న తొలి దశ ఎన్నికలు ముగిశాయి. 29న రెండో దశ ఎన్నికలు జరగనున్నాయి. మే 4న ఫలితాలు విడుదల కానున్నాయి.

ఇది కూడా చదవండి..: Billionaires India | భారత్‌లో 207 మంది బిలియనీర్లు.. ఐదేళ్లలో 51 శాతం పెరగనున్న కుబేరులు

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *