అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Electric Shock Death | నగరంలో(Nizamabad) విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్‌తో ఓ మేస్త్రి మృత్యువాత పడ్డాడు.
Electric Shock Death | బోర్గాం(పి)లోని..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని బోర్గాం(పి)లోని ఓ కమర్షియల్ బిల్డింగ్‌లో లిఫ్ట్ నిర్మాణానికి సంబంధించి అహ్మద్ మిశ్రా అనే గుత్తేదారు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ క్రమంలో గుత్తేదారు ఇద్దరు మేస్త్రీలు కిరణ్(30), దీపక్ అనే ఇద్దరిని పనికి పంపాడు. అయితే గురువారం వీరు లిఫ్ట్ పనులు చేస్తున్న క్రమంలో ఇనుప రాడ్డు పక్కనే ఉన్న 33/11 కేవీ వైర్లకు తగిలింది. ఈ ప్రమాదంలో కిరణ్, దీపక్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. వారిరువురిని స్థానిక ప్రగతి ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే కిరణ్ మృతి చెందాడు. దీపక్ తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు. వీరిద్దరు కూడా నాందేడ్ జిల్లాకు చెందిన వారు. పోలీసులు సమాచారం సేకరించి దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఈ స్టేడియం(MCG)లోని శక్తి భారత్-ఆస్ట్రేలియా సంబంధాలను నిర్వచిస్తుంది.