జాతీయంKejriwal Shock | కేజ్రీవాల్‌కు భారీ షాక్.. ఒకేసారి ముగ్గురు ఎంపీలు బీజేపీ గూటికి!

Kejriwal Shock | కేజ్రీవాల్‌కు భారీ షాక్.. ఒకేసారి ముగ్గురు ఎంపీలు బీజేపీ గూటికి!

దేశ రాజధాని రాజకీయాల్లో అనూహ్యమైన మార్పు చోటుచేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు అత్యంత నమ్మకస్తులుగా, పార్టీ వ్యూహకర్తలుగా పేరున్న ముగ్గురు రాజ్యసభ సభ్యులు అనూహ్యంగా బీజేపీలో చేరారు.

అక్షరటుడే,న్యూఢిల్లీ: Kejriwal Shock | దేశ రాజధాని రాజకీయాల్లో అనూహ్యమైన మార్పు చోటుచేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)కు అత్యంత నమ్మకస్తులుగా, పార్టీ వ్యూహకర్తలుగా పేరున్న ముగ్గురు రాజ్యసభ సభ్యులు అనూహ్యంగా బీజేపీ (BJP)లో చేరారు. యువ నేత రాఘవ్ చడ్ఢా, పార్టీ కీలక నేతలు సందీప్ పాఠక్, అశోక్ మిట్టల్ కమలం కండువా కప్పుకోవడం దేశవ్యాప్త రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టించింది.

Kejriwal Shock | రాజకీయ వ్యూహంలో మార్పు:

పార్లమెంటులో ఆప్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవి నుంచి రాఘవ్ చడ్ఢా (Raghav Chadha)ను పార్టీ అధిష్టానం తొలగించిన కొద్ది రోజుల్లోనే ఈ చేరిక జరగడం గమనార్హం. ఒకప్పుడు బీజేపీ విధానాలను తీవ్రంగా ఎండగట్టిన రాఘవ్ చడ్ఢా, ఇప్పుడు అదే పార్టీ తీర్థం పుచ్చుకోవడం రాజకీయ విశ్లేషకులను విస్మయానికి గురిచేస్తోంది.

Kejriwal Shock | నా గొంతు నొక్కారు:

బీజేపీలో చేరిన అనంతరం రాఘవ్ చడ్ఢా తన పాత పార్టీపై విరుచుకుపడుతూ బాంబు పేల్చారు. నేను ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) వ్యవస్థాపక సభ్యుడిని. పార్టీని నిర్మించడంలో నా పాత్ర ఉంది. అలాంటిది పార్టీలో నా గొంతు నొక్కే ప్రయత్నం చేశారు” అని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆశయాలకు తిలోదకాలు: ఆప్ తన ప్రాథమిక ఆశయాలను విస్మరించిందని, ప్రస్తుతం ఆ పార్టీ అవినీతిపరుల చేతుల్లో చిక్కుకుపోయిందని ఆయన ఆరోపించారు. ప్రజలకు మెరుగైన సేవ చేసేందుకే తాను బీజేపీని సరైన వేదికగా ఎంచుకున్నట్లు స్పష్టం చేశారు.

త్వరలో ఆప్ ఖాళీ: రాజ్యసభలో ఆప్‌కు ఉన్న మొత్తం 10 మంది ఎంపీల్లో ఇప్పటికే తాము ముగ్గురం వచ్చేశామని, త్వరలోనే మరో నలుగురు ఎంపీలు కూడా ఆప్‌కు గుడ్ బై చెప్పబోతున్నారని రాఘవ్ వెల్లడించారు.

బీజేపీలో విలీనం: మూడింట రెండొంతుల మంది ఎంపీలము ఇప్పటికే బీజేపీలో విలీనం అయ్యామని, ఆప్‌కు ఇక రాజ్యసభలో ఉనికి ఉండదని ఆయన స్పష్టం చేశారు. కేజ్రీవాల్‌కు కుడిభుజాలుగా ఉన్న ఈ ముగ్గురు నేతలు దూరమవ్వడం ఆప్‌కు కోలుకోలేని భారీ రాజకీయ నష్టాన్ని మిగిల్చింది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరన్న సత్యాన్ని ఈ ఘటన మరోసారి నిరూపించింది.

ఇది కూడా చదవండి..: Supreme Court | మైనర్ ఇష్టానికి విరుద్ధంగా గర్భం కొనసాగించాలని బలవంతం చేయలేము: సుప్రీంకోర్టు

Shivam nagarani
Shivam nagaranihttps://aksharatodaynews.com/
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Harish Rao TRS row | TRS పేరుతో హరీష్ రావు సొంత పార్టీ!..ఇది కొత్త వ్యూహమా..?

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Harish Rao TRS row | తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర...

Sridip Success Story | తండ్రి మరణంతో కన్నీటి చుక్కలు రాసిన అక్షరాల విజయగాథ!

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Sridip Success Story | పరీక్ష హాలులో ప్రశ్నపత్రాన్ని...

SRH Powerplay Score | SRH ఊచకోత.. MI బౌలర్లపై విరుచుకుపడ్డ ఓపెనర్లు.. పవర్‌ప్లేలోనే మ్యాచ్ మలుపు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: SRH Powerplay Score | ఐపీఎల్‌లో మరోసారి రన్‌ఫెస్ట్‌కు...

Pallikonda Theft Case | పల్లికొండలో దొంగల హల్​చల్​.. ఐదు తులాల బంగారం దోపిడీ..

అక్షరటుడే, భీమ్​గల్: Pallikonda Theft Case | దొంగలు హల్​చల్​ చేశారు....