అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Kashmir Cloudburst | దక్షిణ కశ్మీర్‌లోని అనంతనాగ్ (Anantnag) జిల్లా చిత్తర్గుల్లోని నాలా చోటిహాల్ ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్‌తో భారీ వర్షాలు కురిశాయి. దీంతో ఆకస్మిక వరదలు, వ్యవసాయ భూములు, పండ్ల తోటలు,నివాస ప్రాంతాలకు తీవ్ర నష్టం కలిగించాయి.
ఆకస్మిక వరదతో ఇళ్లలోకి నీరు చేరడం, వరి పొలాలు దెబ్బతినడం, ఆపిల్ తోటలు ప్రభావితం కావడం వంటి తీవ్ర విధ్వంసం జరిగిందని స్థానికులు తెలిపారు. పొలాలు, తోటలన్నీ నాశనమయ్యాయి. ప్రభుత్వం స్పందించి పరిహారం ఇవ్వాలని స్థానికులు కోరారు. ఒక్కసారిగా వరద ముంచెత్తడంతో వందలాది ఇళ్లు నీట మునిగాయి. దీంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఎత్తైన ప్రాంతాలకు పరుగులు తీశారు.
Kashmir Cloudburst | దెబ్బతిన్న రోడ్లు
ఒక్కసారిగా వరద పోటెత్తడంతో పలు రోడ్లు సైతం ధ్వంసం అయ్యాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పరిస్థితిని అంచనా వేసి, నివారణ చర్యలు తీసుకోవడానికి జిల్లా యంత్రాంగం ప్రభావిత ప్రాంతాలకు అత్యవసర బృందాలను పంపింది. ప్రజలు ఇళ్లను ఖాళీ చేసి షెల్టర్స్‌లో తలదాచుకున్నారు. వరదలతో తీవ్ర నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఈ మేరకు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
#WATCH | Jammu & Kashmir | The flash flood following a cloudburst at the Nalla Awoora area of Pahalgam in South Kashmir causes massive wreckage, debris pileup, and large pools of stagnant water. pic.twitter.com/I54qzVVLzf
— ANI (@ANI) July 12, 2026
దీనిని కూడా చదవండి : Harish Rao Statement | రైతుల కోసం రక్తం ఇవ్వడానికి సిద్ధం : హరీశ్ రావు