అక్షరటుడే, భీమ్ గల్: Fishermen Association | జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు (ఎన్‌ఎఫ్‌డీబీ) పథకం కింద మెండోరా మత్స్య పారిశ్రామిక సహకార సంఘానికి (ఎఫ్‌సీఎస్) ఆర్థిక లబ్ధి చేకూరడంపై సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం నేరుగా సొసైటీ ఖాతాలో నిధులు జమ చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ సోమవారం నిర్వహించిన సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi)కి, కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
Fishermen Association | ఈ పథకం ద్వారా..
ఈ పథకం ద్వారా అందిన రూ.90,000 నిధులతో సొసైటీ కార్యాలయానికి కావాల్సిన ఫర్నిచర్‌తో పాటు సభ్యుల సమాచారాన్ని డిజిటలైజ్ చేసేందుకు ఒక నూతన కంప్యూటర్ వ్యవస్థను కొనుగోలు చేశారు. ఈ నూతన సామగ్రిని బీజేపీ భీమ్ గల్ మండల అధ్యక్షుడు అరె రవీందర్ సమక్షంలో ప్రారంభించారు. ఈ నిధుల మంజూరుకు సహకరించిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, బాల్కొండ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ ఏలేటి మల్లికార్జున్ రెడ్డిల కృషిని కొనియాడుతూ సంఘ సభ్యులు వారికి ధన్యవాదాలు తెలియజేశారు.
Fishermen Association | మత్స్యకారుల సంక్షేమమే కేంద్ర ధ్యేయం: అరె రవీందర్
బీజేపీ మండల అధ్యక్షుడు అరె రవీందర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కేవలం మెండోరాకే కాకుండా భీంగల్ మండలంలోని మరో ఏడు సంఘాలకు కూడా రూ.90,000 చొప్పున నిధులు మంజూరు చేసిందని వివరించారు. మండలంలో మొత్తం ఎనిమిది మత్స్యకార సంఘాలకు ఈ లబ్ధి చేకూరినట్లు ఆయన పేర్కొన్నారు. మత్స్యకారుల ఆర్థికాభివృద్ధి కోసం కేంద్రం ప్రవేశపెడుతున్న వివిధ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Fishermen Association | పథకాల వివరాలు..

చేపల పెంపకం, మత్స్య వ్యాపారాల విస్తరణ కోసం రూ.10 లక్షల నుండి రూ.1 కోటి వరకు భారీ సబ్సిడీ ఆధారిత రుణాలు అందుబాటులో ఉన్నాయి. రవాణా సౌకర్యాల కోసం రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ద్విచక్ర, త్రిచక్ర వాహనాలను కూడా అందిస్తున్నారు.ఈ పథకాల ప్రయోజనాలు పొందేందుకు అవసరమైన మార్గదర్శకత్వం, సహాయ సహకారాలను అందించేందుకు బీజేపీ మండల శాఖ ఎల్లప్పుడూ మత్స్యకారులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మెండోరా సొసైటీ అధ్యక్షుడు ముస్లి ఎర్రన్న, ఉపాధ్యక్షుడు కల్లెడ రవికుమార్, కార్యదర్శి గజనవేణి మోహన్, డైరెక్టర్లు, బీజేపీ నాయకులు నాగార్జున్ రెడ్డి, కిసాన్ మోర్చా ప్రతినిధి అంజయ్య, బూత్ అధ్యక్షుడు బాబురావు, రాము, శ్రీనివాస్ గౌడ్, లింబయ్య తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: AITUC District Conference | కార్మిక హక్కులను కాలరాస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు