అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Trump on Hormuz | అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) సంచలన వ్యాఖ్యలు చేశారు. హర్ముజ్ జలసంధి తమ ఆధీనంలో ఉందని, ఆ మార్గంలో వెళ్లే నౌకలు తమకు పన్ను చెల్లించాలన్నారు.
హర్ముజ్ జలసంధిని తమ నియంత్రణలో ఉంచుకోవడానికి ఇరాన్ ప్రయత్నిస్తోంది. నౌకల నుంచి ఫీజు వసూలు చేయాలని ఆ దేశం యోచిస్తోంది. ఈ క్రమంలో ట్రంప్ వ్యాఖ్యలు చేయడం మరోసారి ఆందోళనలకు దారి తీసింది. ఈ జలమార్గంలో సురక్షిత ప్రయాణం కోసం నౌకలపై అమెరికా ఛార్జీలు వసూలు చేయడం ప్రారంభిస్తుందని ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ నౌకలను ఇకపై జలసంధి గుండా ప్రయాణించడానికి అనుమతించబోమని, అర్హత ఉన్న సరుకులపై అమెరికా 20 శాతం సుంకం విధిస్తుందని ట్రంప్ తెలిపారు. అత్యంత అస్థిరమైన ఈ ప్రాంతానికి భద్రత, రక్షణ కల్పించే పనికి అవసరమైన అన్ని ఖర్చులను భరించడానికి ఈ సుంకాన్ని ఉపయోగిస్తామని ట్రంప్ చెప్పారు.
Trump on Hormuz | జోక్యాన్ని సహించం
హర్ముజ్ జలసంధి నిర్వహణలో అమెరికా జోక్యాన్ని అనుమతించబోమని ఇరాన్ అత్యున్నత సంయుక్త సైనిక విభాగమైన ‘ఖతమ్ అల్-అంబియా సెంట్రల్ హెడ్‌క్వార్టర్స్’ సోమవారం ప్రకటించింది. ఇరాన్ నిర్ణయించిన మార్గాలకు వెలుపల, తమ సాయుధ దళాలతో సమన్వయం లేకుండా ఈ జలసంధి మీదుగా ప్యాణించడానికి అమెరికా సైన్యం చేసే ఏ ప్రయత్నాన్నైనా తీవ్రంగా అడ్డుకుంటామని ప్రకటించింది. సోమవారం అమెరికా, ఇరాన్ దళాల మధ్య భారీ క్షిపణి, డ్రోన్ దాడులు జరిగాయి. గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలపై దాడులు చేశామని, హర్ముజ్ జలసంధిని మూసి ఉంచామని ఇరాన్ ప్రకటించడంతో చమురు ధరలు పెరిగాయి.
దీనిని కూడా చదవండి : El Nino Telangana | ఎల్‌నినో సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధం : మంత్రి తుమ్మల