అక్షరటుడే, వెబ్‌డెస్క్: Nvidia CEO | జెన్సన్ హువాంగ్ ఎన్విడియాకు చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా మళ్లీ నియమితులైన విషయం తెలిసిందే. ఆయన కార్యాలయానికి చేరుకోగా.. ఉద్యోగులు ఘనంగా స్వాగతం పలికారు.
ప్రముఖ చిప్ తయారీ సంస్థ అయిన ఎన్విడియా సీఈవో జెన్సన్ (CEO Jensen) ఇటీవల తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. చైనా గూఢచారితో ఆయనకు వివాహేతర సంబంధం ఉందనే విషయం వెలుగులోకి రావడంతో పదవి వదిలేశారు. అనంతరం ఆయనకు పలువురు మద్దతు తెలిపారు. ఈ క్రమంలో కంపెనీ సైతం ఆయనకు అండగా నిలుస్తూ.. తిరిగి సీఈవోగా నియమించింది.
Nvidia CEO | సుదీర్ఘ సమావేశం
తిరిగి నియామకం కావడానికి ముందు ఆయన ఆయన కంపెనీ బోర్డుతో సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. విస్తృతంగా ప్రచారంలో ఉన్న రెండు వ్యవహారాలు మినహా తన మిగతా అన్ని వ్యవహారాలను వెల్లడించినట్లు సమాచారం. ఈ చర్చలో హువాంగ్ తన ప్రవర్తన పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. కంపెనీ సహ-వ్యవస్థాపకుడైన హువాంగ్, రెండు వివాహేతర సంబంధాల నివేదికల తర్వాత తన పదవికి రాజీనామా చేశారు. ఆయనకు నేరుగా రిపోర్ట్ చేసే ఎన్విడియా హెల్త్‌కేర్ వైస్ ప్రెసిడెంట్ కింబర్లీ పావెల్‌తో, చైనా గూఢచార సంస్థలతో కలిసి పనిచేస్తున్నారని అమెరికా అధికారులు భావించిన చైనా వ్యాపారవేత్త ఆలిస్ హువాంగ్‌తో ఆయన బంధం కొనసాగించారు. సంస్థలోని మరో మహిళతో సైతం ఆయనకు వివాహేతర సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఇది కూడా చదవండి..: Sheikh Hasina | డిసెంబర్ 16న బంగ్లాదేశ్‌కు వెళ్తా : షేక్ హసీనా