Ponnam Prabhakar | చొరబాట్లు ఆపకుండా అమిత్​ షా ఏం చేస్తున్నారు : మంత్రి పొన్నం

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Ponnam Prabhakar | ఎస్​ఐఆర్​ పేరుతో ఓట్ల తొలగింపుపై బీజేపీ సమాధానం చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్​ డిమాండ్​ చేశారు. ఓటర్ల తొలగింపులు, ఎన్నికల డేటాలో మార్పులు, ఎన్నికల కమిషన్ స్వతంత్రతపై రాహుల్ గాంధీ అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం బీజేపీ నేతలకు ఉందా అని ప్రశ్నించారు.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్​ నబిన్​ సోమవారం కరీంనగర్​లో పర్యటించారు. రాహుల్​ గాంధీ (Rahul Gandhi)పై విమర్శలు చేశారు. ఆయన వ్యాఖ్యలపై పొన్నం ప్రభాకర్​ స్పందించారు. ఎక్స్​ వేదికగా వీడియో రిలీజ్ చేశారు. చొరబాటుదారుల ఓట్లను రక్షించాలని తాము అడగడం లేదన్నారు. అయితే దేశంలోకి అక్రమంగా చొరబాట్లు జరగుతుంటే, అడ్డుకోకుండా కేంద్ర హోం మంత్రి అమిత్​ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమే ఉన్నప్పుడు చొరబాటుదారులు ఓటర్లుగా ఎలా మారుతున్నారన్నారు.

Ponnam Prabhakar | నిధులపై సమాధానం చెప్పాలి

కరీంనగర్‌కు వచ్చి రాహుల్ గాంధీ గారిని విమర్శించడం కాదని, 12 ఏళ్లలో తెలంగాణకు బీజేపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, కేంద్రం నుంచి రాష్ట్రానికి తీసుకొచ్చిన నిధులపై సమాధానం చెప్పాలని డిమాండ్​ చేశారు. ప్రజాస్వామ్య సంస్థలను బలహీనపరుస్తూ, రాజ్యాంగ పరిరక్షణ పేరుతో యాత్రలు చేయడం బీజేపీ ద్వంద్వ నీతికి నిదర్శనమని విమర్శించారు. ఎస్​ఐఆర్​పై పార్లమెంటులో ప్రత్యేక చర్చకు సిద్ధం కావాలన్నారు.

ఇది కూడా చదవండి..: Khammam Road Accident | కారును ఢీకొన్న లారీ.. దంపతుల మృతి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *