అక్షరటుడే, వెబ్డెస్క్: Khammam Road Accident | ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గ్రీన్ ఫీల్డ్ హైవే ఎగ్జిట్ వద్ద ఓ కారును లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో దంపతులు మృతి చెందారు.
హైదరాబాద్ (Hyderabad)కు చెందిన కిషోర్ రెడ్డి-లావణ్య కుటుంబంతో కలిసి అన్నవరం వెళ్లారు. కార్తీక మాసం నేపథ్యంలో అక్కడ సత్యనారాయణ వ్రతం చేయించుకున్నారు. అనంతరం తిరుగు పయనం అయ్యారు. వీరి కారు గ్రీన్ఫీల్డ్ హైవే మీదుగా వస్తుండగా.. ఖమ్మం జిల్లా వైరా మండలంలో ప్రమాదం చోటు చేసుకుంది. వారి కారును లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ కిషోర్ రెడ్డి, లావణ్య అక్కడికక్కడే మృతి చెందారు. వారి కుమారుడు ప్రణీత్ తీవ్రంగా గాయపడగా.. స్థానికులు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Khammam Road Accident | రెండు లారీలు దగ్ధం
విశాఖపట్నంలోఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సబ్బవరం మండలం బాటజంగాలపాలెం టోల్గేట్ వద్ద టైర్ల లోడుతో ఆగి ఉన్న లారీని టిప్పర్ ఢీకొంది. దీంతో మంటలు చెలరేగాయి. అనంతరం అవి రెండు వాహనాలకు వ్యాపించాయి. టిప్పర్, లారీ పూర్తిగా కాలిబూడిద అయ్యాయి. టిప్పర్లో ఉన్న ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.
ఇది కూడా చదవండి..: Telangana K12 Education Reform | ఆరు దశల్లో స్కూల్ – ఇంటర్ విలీన ప్రక్రియ.. 2030 నాటికి ‘కే-12’ విధానం!