Bhogapuram Accident | ట్యాంకర్​ను ఢీకొన్న థార్​ జీపు.. ఐదుగురు మృతి

విజయనగరం జిల్లా భోగాపురం హైవేపై మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Bhogapuram Accident | విజయనగరం జిల్లా (Vizianagaram District) భోగాపురం హైవేపై మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న ట్యాంకర్​ను థార్​ జీపు ఢీకొంది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు.

భోగాపురం హైవేపై సుందరపేట సమీపంలో జిప్సి అదుపుతప్పి రోడ్డుపై ఆగి ఉన్న ట్యాంకర్​ను ఢీకొంది. ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడ్డ వ్యక్తిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన కూడా చనిపోయారు.

Bhogapuram Accident | తీవ్ర విషాదం

మృతులను విశాఖ జిల్లాకు చెందిన బొర్రా సతీష్‌, బొర్రా శృతి, కొండపు సూరిబాబు, వాకలపూడి శ్రీను, కుసుమ రంజనిగా గుర్తించారు. సతీష్​– శృతి, శ్రీను–రంజని భార్యాభర్తలు. వారి మృతితో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటనపై మంత్రి నారా లోకేశ్​ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.

ఇది కూడా చదవండి..: Khammam Road Accident | కారును ఢీకొన్న లారీ.. దంపతుల మృతి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *