July 14 Gold Prices | భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఒక్కరోజులోనే బంగారంపై రూ.1,900, వెండిపై రూ.5,300 తగ్గుదల

సెప్టెంబర్ డెలివరీ వెండి ధర కూడా భారీగా పడిపోయింది. ఎంసీఎక్స్‌లో కిలో వెండి రూ.4,016 తగ్గి రూ.2,18,648 వద్ద ప్రారంభమైంది.

Naresh Chandan

July 14 Gold Prices | దేశీయ బులియన్ మార్కెట్లో మంగళవారం (జులై 14, 2026) బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు కొంత సద్దుమణగడంతో విలువైన లోహాలపై అమ్మకాల ఒత్తిడి పెరిగింది. సోమవారం ఒక్కరోజులోనే 10 గ్రాముల బంగారం ధర రూ.1,900 వరకు తగ్గగా, కిలో వెండి ధర రూ.5,300 మేర క్షీణించింది.

July 14 Gold Prices | మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో…

ఆగస్టు డెలివరీ బంగారం రూ.845 తగ్గి 10 గ్రాములకు రూ.1,42,633 వద్ద ప్రారంభమైంది. ట్రేడింగ్ సమయంలో మరింత క్షీణించి ఇంట్రాడేలో రూ.1,41,557 కనిష్ఠ స్థాయిని తాకింది. అనంతరం స్వల్పంగా కోలుకుని 10 గ్రాములకు రూ.1,42,222 వద్ద ట్రేడవుతోంది.

Strait of Hormuz | హోర్ముజ్ జలసంధిపై ఆధిపత్యం మాదే.. అమెరికా-ఇరాన్ పరస్పర ప్రకటనలు

ఇక సెప్టెంబర్ డెలివరీ వెండి ధర కూడా భారీగా పడిపోయింది. ఎంసీఎక్స్‌లో కిలో వెండి రూ.4,016 తగ్గి రూ.2,18,648 వద్ద ప్రారంభమైంది.

July 14 Gold Prices | అంతర్జాతీయ మార్కెట్‌లో ఒత్తిడి

అంతర్జాతీయ మార్కెట్‌లోనూ బంగారం, వెండి ధరలు ఒత్తిడిలోనే కొనసాగుతున్నాయి. కామెక్స్ (COMEX)లో బంగారం ధర ఒక శాతానికి పైగా పడిపోయి ఔన్సుకు సుమారు 4,070 అమెరికన్ డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అలాగే వెండి ధర 2.5 శాతానికి పైగా క్షీణించి ఔన్సుకు 58.64 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

మధ్యప్రాచ్య భౌగోళిక ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం, అంతర్జాతీయ మార్కెట్లలో లాభాల స్వీకరణ పెరగడం వల్ల బంగారం, వెండి ధరలపై ఒత్తిడి కొనసాగుతున్నట్లు మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *