అక్షరటుడే, వెబ్డెస్క్ : Telangana Weather | ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. వేసవిని తలపించేలా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. వరుణుడు ముఖం చాటేశాడు. వారం రోజులుగా ఎండలు పెరగడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
తెలంగాణ (Telangana)లో రేపటి నుంచి ఎండలు తగ్గుముఖం పడుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బుధవారం నుంచి రుతుపవనాల విరామ ప్రభావం (break monsoon) కొంత తగ్గుముఖం పడుతుంది. జూలై 15 నుంచి పశ్చిమ మరియు ఉత్తర తెలంగాణలో అక్కడక్కడా వర్షాలు మొదలవుతాయి. మంగళవారం వాతావరణం పొడిగా ఉంటుంది. హైదరాబాద్ నగరంతో సహా రాష్ట్రవ్యాప్తంగా తీవ్రమైన వేడి కొనసాగుతుంది. అయితే రేపటి నుంచి అక్కడక్కడ వర్షాలు కురుస్తాయి.
Telangana Weather | ఉక్కపోత నుంచి ఉపశమనం
జూలై 16-19 మధ్య వర్షపాతం మరింత పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా తూర్పు తెలంగాణ జిల్లాల్లోనూ, హైదరాబాద్ నగరంలోనూ అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. ఈ వర్షాలు భారీగా లేకపోయినా.. ప్రస్తుతం ఉన్న వేడి, పొడి వాతావరణం నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి. అంతేగాకుండా ప్రస్తుతం నీరు లేక పంటలు ఎండుతున్నాయి. ఈ క్రమంలో వర్షాల కోసం ఎదురు చూస్తున్న అన్నదాతలకు రేపటి నుంచి పడే వానలు మేలు చేయనున్నాయి.
ఇది కూడా చదవండి..: Mettu Samson Nizamabad Congress | కాంగ్రెస్లో ముప్పై ఏళ్ల నమ్మకానికి మిగిలింది అవమానాలేనా? నిజామాబాద్ రూరల్‌లో ఓ సీనియర్ నేత ప్రశ్న.. నెట్టింట వైరల్!