Revanth Reddy Meetings | రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ..కేంద్ర మంత్రులతో వరుస భేటీలు

రాష్ట్ర అభివృద్ధిని పరుగులు పెట్టించే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులతో చర్చలు జరుపుతున్నారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Revanth Reddy Meetings | రాష్ట్ర అభివృద్ధిని పరుగులు పెట్టించే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులతో చర్చలు జరుపుతున్నారు. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం భేటీ అయ్యారు. తెలంగాణలోని జాతీయ రహదారుల ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి మంత్రి గడ్కరీతో చర్చించారు.

Revanth Reddy Meetings | రీజనల్ రింగ్ రోడ్డు (RRR)..

ఆర్ఆర్ఆర్ నార్త్ పార్ట్ పనుల ప్రారంభానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపాలని, అలాగే సదరన్ పార్ట్ కు సంబంధించిన అన్ని అనుమతులు త్వరితగతిన మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని జాతీయ రహదారులను డ్రైపోర్ట్‌లకు అనుసంధానం చేస్తూ, రవాణా సౌకర్యాలను మెరుగుపరిచేలా అనుమతులు ఇవ్వాలని కోరారు.
revanth.1 3

Revanth Reddy Meetings |రామ్మోహన్ నాయుడితో భేటీ..

కాసేపట్లో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడితో సీఎం సమావేశం కానున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం శంషాబాద్ విమానాశ్రయం మాత్రమే సేవలందిస్తున్న నేపథ్యంలో, కొత్తగా మూడు ఎయిర్‌పోర్టుల అభివృద్ధిపై ఆయన దృష్టి సారించనున్నారు. ముఖ్యంగా వరంగల్‌లోని మామునూరు, ఆదిలాబాద్ . భద్రాద్రి కొత్తగూడెం ఎయిర్‌పోర్టుల ఏర్పాటు , అభివృద్ధికి అవసరమైన అనుమతులపై చర్చించనున్నారు.

Revanth Reddy Meetings | మనోహర్ లాల్ ఖట్టర్‌తో భేటీ..

విమానయాన శాఖ మంత్రితో భేటీ అనంతరం , కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. ఈ భేటీలో హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించి ఫేస్-1 విస్తరణ , ప్రతిష్టాత్మకమైన మెట్రో ఫేస్-2 పనులకు సంబంధించిన అంశాలపై కీలక చర్చలు జరగనున్నాయి.

 

 

ఇది కూడా చదవండి:  Indian Stock Market | నష్టాల్లో దేశీయ మార్కెట్లు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *