Nizamabad Rice Exports | ఎల్లలు దాటుతున్న ఇందూరు బియ్యం.. యూకేకు ఎగుమతులు ప్రారంభించిన కలెక్టర్​

నిజామాబాద్​ నుంచి యునైటెడ్ కింగ్‌డమ్​ (యూకే)కు బియ్యం ఎగుమతిని కలెక్టర్​ ప్రారంభించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad Rice Exports | జిల్లా నుంచి యునైటెడ్ కింగ్‌డమ్​ (యూకే)కు బియ్యం(UK Rice Export) ఎగుమతులు మొదలయ్యాయి. ఈ మేరకు బుధవారం నిజామాబాద్​(Nizamabad) కలెక్టర్​ ఇలా త్రిపాఠి(Collector Ila Tripathi) జెండా ఊపి ఎగుమతులను ప్రారంభించారు.

Nizamabad Rice Exports | ఇరు దేశాల మధ్య ఒప్పందం ప్రకారం..

భారత్, యూకే మధ్య అమల్లోకి వచ్చిన సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం (Comprehensive Economic Trade Agreement – CETA) ప్రకారం..నగరంలోని గజానన్ రైస్ మిల్ యాజమాన్యం యునైటెడ్ కింగ్‌డమ్‌కు బియ్యం ఎగుమతులకు అధికార యంత్రాంగం నుంచి అనుమతులు సాధించింది. ఈ మేరకు గజానన్ రైస్​మిల్​ నుంచి యూకేకు ఎగుమతి అవుతున్న సోనా మసూరి ఎక్స్​పోర్ట్​ క్వాలిటీ బియ్యం నిల్వలతో కూడిన వాహనాలను కలెక్టర్​ ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. సీఈటీఏ అమలుతో భారతీయ వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లలో మరింత ప్రాధాన్యత లభిస్తోందని తెలిపారు.

Nizamabad Rice Exports | తెలంగాణాలో నాణ్యమైన వరి ఉత్పత్తులు..

ముఖ్యంగా తెలంగాణలో నాణ్యమైన వరి ఉత్పత్తికి ప్రసిద్ధి చెందిన నిజామాబాద్ జిల్లా నుంచి యూకేకు బియ్యం ఎగుమతులు ప్రారంభం కావడం జిల్లాకు గర్వకారణమని కలెక్టర్​ అన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యమైన బియ్యాన్ని ఉత్పత్తి చేసి విదేశాలకు ఎగుమతి చేయడం ద్వారా రైతులకు మెరుగైన ధరలు లభించడంతో పాటు జిల్లాకు మంచి గుర్తింపు వస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని దేశాలకు కూడా జిల్లా నుంచి వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు పెరిగేలా అధికారులు, ఎగుమతిదారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వీరస్వామి, ఉద్యానవన శాఖ అధికారి శ్రీనివాస్, గజానన్ రైస్ మిల్ ప్రతినిధి హితేష్ తదితరులు పాల్గొన్నారు.

rice22

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *