అక్షరటుడే, వెబ్‌డెస్క్: Bigg Boss Telugu 10 | తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్‌బాస్ తెలుగు 10 సీజన్‌కు ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. ఒకవైపు కామనర్స్ ఎంపిక ప్రక్రియ, మరోవైపు సెలబ్రిటీ కంటెస్టెంట్ల ఎంపికతో షోకు సంబంధించిన సందడి రోజురోజుకూ పెరుగుతోంది.
గత సీజన్లో మంచి ఆదరణ పొందిన “అగ్నిపరీక్ష” కాన్సెప్ట్‌ను ఈసారి కూడా కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కామనర్స్ నుంచి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను పలుదశల్లో పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ప్రాథమిక ఎంపిక పూర్తైన తర్వాత ఎంపికైన వారితో ఆగస్టులో అగ్నిపరీక్ష నిర్వహించే అవకాశం ఉందని వినిపిస్తోంది. ఈ ప్రక్రియ ద్వారా ఐదుగురు నుంచి పది మంది వరకు కామనర్స్‌కు బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టే అవకాశం దక్కొచ్చని టాక్.
Bigg Boss Telugu 10 | జోరుగా సెలబ్రిటీ కంటెస్టెంట్ల ఎంపిక !
మరోవైపు సెలబ్రిటీ కంటెస్టెంట్ల ఎంపిక కూడా జోరుగా సాగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. షో నిర్వాహకులు పలువురు టెలివిజన్ నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు, యాంకర్లు, గాయకులను సంప్రదిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో కొందరు ప్రముఖులు కూడా ఈ షోలో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.
ఇప్పటికే పలువురు ప్రముఖుల పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నటుడు ప్రభాకర్ లేదా ఆయన కుమారుడు చంద్రహాస్ ఈ సీజన్లో కనిపించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. అలాగే టెలివిజన్ నటుడు శివకుమార్, మరో బుల్లితెర నటుడు పవన్ పేర్లు కూడా చర్చలో ఉన్నాయి.
Maa Inti Bangaram | 100 కోట్ల క్లబ్‌లోకి ‘మా ఇంటి బంగారం’.. సమంత ఆనందం వైరల్
Bigg Boss Telugu 10 | సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు
ఇక కామెడీ షోల ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ఎక్స్‌ప్రెస్ హరి, తేజస్విని, నటి సోనియా సింగ్, ప్రముఖ గాయని మంగ్లీ, యాంకర్ నిఖిల్, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు నందు, రమణ తదితరుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఇవన్నీ ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారమే తప్ప, అధికారికంగా ఎలాంటి జాబితా విడుదల కాలేదు.
బిగ్‌బాస్ ప్రతి సీజన్ ప్రారంభానికి ముందు ఇలాంటి అనేక పేర్లు వినిపించడం సహజమే. అయితే చివరి దశలో పారితోషికం, కాల్షీట్లు, వ్యక్తిగత కమిట్మెంట్లు, షో నిబంధనలు వంటి అంశాల ఆధారంగా తుది జాబితాలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంటుంది.
Bigg Boss Telugu 10 | 20 మంది కంటెస్టెంట్లతో..
తాజా సమాచారం ప్రకారం.. ఆగస్టు మూడో వారంలో సెలబ్రిటీ కంటెస్టెంట్ల ఎంపికపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కామనర్స్ అగ్నిపరీక్షలో ఎంపికైనవారితో పాటు సెలబ్రిటీలను కలిపి సుమారు 20 మంది కంటెస్టెంట్లతో ఈసారి హౌస్‌ను సిద్ధం చేయనున్నట్లు తెలుస్తోంది.
అన్నీ అనుకున్నట్లుగా జరిగితే, బిగ్‌బాస్ తెలుగు 10 సెప్టెంబర్ తొలి ఆదివారం గ్రాండ్‌గా ప్రారంభమయ్యే అవకాశముంది. ఈసారి కూడా ప్రముఖ నటుడు నాగార్జున హోస్ట్‌గా ప్రేక్షకులను అలరించనున్నారనే ప్రచారం సాగుతోంది. అయితే షో ప్రారంభ తేదీ, కంటెస్టెంట్ల పూర్తి జాబితాపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.