Dr. Anil Menon | అంతరిక్షంలోకి మరో ఇండియన్​.. ఎవరంటే..!

ఎముకలు, కండరాలు, గుండె మరియు మెదడు పనితీరుపై శూన్య గురుత్వాకర్షణ ప్రభావాన్ని అధ్యయనం చేయనున్నారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Dr. Anil Menon | నాసా nasa వ్యోమగామి డాక్టర్ అనిల్ మీనన్ సోయుజ్ MS-29 (Soyuz MS-29) వ్యోమనౌక ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) తన తొలి అంతరిక్ష యాత్రను ప్రారంభించారు.

Dr. Anil Menon | పరిశోధనల లక్ష్యం

డాక్టర్ అనిల్ మీనన్ సోయుజ్ ప్రధానంగా వైద్య, జీవశాస్త్ర, అంతరిక్ష పరిశోధనలపై ప్రయోగాలు చేయనున్నారు. అంతరిక్షంలో ఎక్కువ కాలం గడిపే వ్యోమగాముల శరీరంలో వచ్చే మార్పులు, ముఖ్యంగా ఎముకలు, కండరాలు, గుండె, మెదడు పనితీరుపై శూన్య గురుత్వాకర్షణ (Microgravity) ప్రభావాన్ని ఆయన అధ్యయనం చేయనున్నారు.

Bigg Boss Telugu 10 | బిగ్‌బాస్ తెలుగు 10పై ఆసక్తి పెరుగుతోంది.. కామనర్స్ అగ్నిపరీక్షకు కౌంట్‌డౌన్, సెలబ్రిటీల ఎంపికపై ఉత్కంఠ

Dr. Anil Menon | చంద్ర, అంగారక గ్రహాల సుదీర్ఘ మిషన్లకు

ఈ పరిశోధనలు భవిష్యత్తులో చేపట్టబోయే చంద్ర, అంగారక (Mars) గ్రహాల సుదీర్ఘ మిషన్లకు ఎంతో కీలకం కానున్నాయి. అనిల్ మీనన్, రష్యన్ వ్యోమగాముల బృందం అంతరిక్ష కేంద్రంలో సుమారు 8 నెలల పాటు గడపనుంది.

భార్యాభర్తలు ఇద్దరూ…

వచ్చే ఏడాది ఏప్రిల్‌లో అనిల్​ తిరిగి భూమికి చేరుకుంటారు. డాక్టర్ అనిల్ మీనన్ భార్య అన్నా విల్హెల్మ్ కూడా 2024లో స్పేస్ ఎక్స్ చేపట్టిన ఒక ప్రైవేట్ మిషన్ ద్వారా 5 రోజుల పాటు అంతరిక్షంలో గడిపిన వ్యోమగామి. దీంతో అంతరిక్ష యాత్ర చేసిన అరుదైన భార్యాభర్తల జంటలలో వీరు ఒకరిగా నిలిచారు.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *