అక్షరటుడే, వెబ్‌డెస్క్: NEET UG Results | దేశవ్యాప్తంగా వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించిన NEET UG 2026 రీ-ఎగ్జామినేషన్ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) గురువారం రాత్రి ప్రకటించింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ అప్లికేషన్ వివరాలు నమోదు చేసి స్కోర్‌కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
NEET UG Results | 20 లక్షల మంది అభ్యర్థులు హాజరు..
ఈ ఏడాది నిర్వహించిన రీ-ఎగ్జామ్‌కు సుమారు 20 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారని ఎన్‌టీఏ వెల్లడించింది. వీరిలో 11.21 లక్షల మంది వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు అర్హత సాధించినట్లు తెలిపింది.
దేశంలోని 66 నగరాల నుంచి మొత్తం 138 మంది అభ్యర్థులు అత్యుత్తమ ర్యాంకులను సాధించారు. 720 మార్కులకు గాను 705కు పైగా మార్కులు సాధించిన 17 మంది టాపర్లుగా నిలిచారు. వీరిలో తెలంగాణ, పంజాబ్, హరియాణా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బిహార్, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఉన్నారు.
NEET UG Results | 19 మందికి 700కు పైగా మార్కులు
అత్యధిక మార్కులు సాధించిన అభ్యర్థుల్లో పంజాబ్‌కు చెందిన ఆర్యన్ గుప్తా, హరియాణాకు చెందిన పన్‌షుల్ బన్సల్ చెరో 715 మార్కులు సాధించి అగ్రస్థానంలో నిలిచారు. మొత్తం 19 మంది అభ్యర్థులు 700కు పైగా మార్కులు నమోదు చేశారు.
మార్కుల వారీగా చూస్తే 650కు పైగా మార్కులు 1,492 మంది, 600కు పైగా మార్కులు 10,160 మంది, 500కు పైగా మార్కులు 90,780 మంది సాధించినట్లు ఎన్‌టీఏ వెల్లడించింది.
Puri Rath Yatra | పూరి రథయాత్రలో తొక్కిసలాట.. ఒకరి మృతి, పలువురికి గాయాలు
NEET UG Results | కేటగిరీల వారీగా..
కేటగిరీల వారీగా అర్హత సాధించిన వారి సంఖ్య కూడా ప్రకటించారు. జనరల్ విభాగంలో 2.91 లక్షల మంది, ఓబీసీ (NCL)లో 5.12 లక్షల మంది, ఎస్సీ విభాగంలో 1.59 లక్షల మంది, ఎస్టీ విభాగంలో 63,716 మంది, ఈడబ్ల్యూఎస్‌లో 95,026 మంది, పీడబ్ల్యూబీడీ కేటగిరీలో 3,666 మంది, పీడబ్ల్యూడీ విభాగంలో 303 మంది అర్హత సాధించారు.
మొదట మే 3న పరీక్ష
వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం మొదట మే 3న నిర్వహించిన NEET UG పరీక్ష అనంతరం ప్రశ్నపత్రం లీక్ వివాదం తలెత్తడంతో, జూన్ 21న దేశవ్యాప్తంగా రీ-ఎగ్జామినేషన్ నిర్వహించారు.
అనంతరం జులై 13న ఓఎంఆర్ షీట్లు విడుదల చేసిన ఎన్‌టీఏ, అభ్యర్థుల నుంచి జులై 15 వరకు అభ్యంతరాలు స్వీకరించింది. వాటిని పరిశీలించిన తర్వాత ఫైనల్ ఆన్సర్ కీని విడుదల చేసి, కొద్ది గంటల్లోనే రీ-ఎగ్జామ్ ఫలితాలను ప్రకటించింది.