Cyberabad CI Transfers | సైబరాబాద్​లో భారీగా సీఐల బదిలీ

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో భారీగా సీఐలు బదిలీ అయ్యారు. మొత్తం 55 మందిని ట్రాన్స్​ఫర్​ చేస్తూ సీపీ రమేష్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Cyberabad CI Transfers | సైబరాబాద్ (Cyberabad) కమిషనరేట్ పరిధిలో భారీగా సీఐలు బదిలీ అయ్యారు. మొత్తం 55 మంది సీఐలను ట్రాన్స్​ఫర్​ చేస్తూ  సీపీ రమేష్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

Cyberabad CI Transfers | బదిలీ అయిన సీఐలు

కూకట్​పల్లి ఎస్​హెచ్​వోగా పని చేస్తున్న కేవీ సుబ్బారావు మాదాపూర్​కు బదిలీ అయ్యారు. వెయిటింగ్​లో ఉన్న పి. రమేష్​నుమాదాపూర్ డీఐగా ట్రాన్స్​ఫర్​ చేశారు. రాయదుర్గం ఎస్​హెచ్​వోగా టి భూపతి, కూకట్‌పల్లి ఎస్​హెచ్​వోగా డి. స్వామి గౌడ్ బదిలీపై వెళ్లనున్నారు. కూకట్‌పల్లి డీఐగా జి. శేఖర్ రెడ్డి, బాలానగర్ ఎస్​హెచ్​వోగా జి. ప్రశాంత్, మియాపూర్ ఎస్​హెచ్​వోగా ఎన్. జయరాం, మియాపూర్ డీఐగా డి. విజయ నాయక్, కేపీహెచ్‌బీ ఎస్​హెచ్​వోగా జి. విజయ్ కుమార్, కేపీహెచ్‌బీ డీఐగా బి. భూపాల్ బదిలీ అయ్యారు.

Cyberabad CI Transfers

కొల్లూరు ట్రాఫిక్ ఎస్​హెచ్​వోగా వెంకట్ రెడ్డి, అల్లాపూర్ SHOగా ఎస్. నవీన్ కుమార్ గచ్చిబౌలి కె. సైదులు, నార్సింగి ఎస్​హెచ్​వోగా డి. విష్ణువర్ధన్ రెడ్డి, కొల్లూరు ఎస్​హెచ్​వోగా చి. సైది రెడ్డిని నియమిస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు. చందానగర్ ఎస్​హెచ్​వోగా ఏ.ఆర్.ఈ. శ్రీధర్, చందానగర్ డీఐగా వి. జానయ్య, ఆర్‌సీ పురం ఎస్​హెచ్​వోగా జి. లాలు నాయక్, పటాన్‌చెరు ఎస్​హెచ్​వోగాగా ఎం. రవీందర్ బదిలీ అయ్యారు. ఇలా మొత్తం 55 మందిని ట్రాన్స్​ఫర్ చేశారు.

ఇది కూడా చదవండి..: Kalma Homework Controversy | ‘కల్మా’ హోంవర్క్​ వివాదం.. కఠిన చర్యలు తీసుకోవాలన్న వీహెచ్​

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *