Anna Lezhneva Tirumala | తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పవన్​ సతీమణి

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Anna Lezhneva Tirumala | ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా తిరుమల (Tirumala) శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.

పవన్​ కల్యాణ్​కు ఇటీవల శస్త్రచికిత్స జరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. ఈ క్రమంలో పవన్​ త్వరగా కోలుకోవాలని ఆయన సతీమణి శ్రీవారిని దర్శించుకొని, పూజలు చేశారు. శుక్రవారం రాత్రి తిరుమలకు చేరుకున్న ఆమెకు అధికారులు ఘన స్వాగతం పలికారు.

Anna Lezhneva Tirumala | కాలినడకన..

Anna Lezhneva Tirumala

అన్నా లెజినోవా మెట్ల మార్గంలో స్వామివారిని దర్శించుకున్నారు. అలిపిరి నడకమార్గం ద్వారా ఆమె తిరుమల చేరుకున్నారు. అనంతరం వరాహస్వామిని దర్శించుకున్నారు. శనివారం ఉదయం సుప్రభాత సేవలో పాల్గొన్నారు. అనంతరం ఆమెకు టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. లెజినోవా మాట్లాడుతూ.. భక్తులతో కలిసి తిరుమల మెట్లు ఎక్కడం ఆనందంగా ఉందని తెలిపారు. మెట్ల మార్గంలో తిరుమల చేరుకోవడానికి నాలుగు గంటలు పట్టిందన్నారు. గతంలో తన కుమారుడి కోసం సైతం ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకొని మొక్కు చెల్లించుకున్నారు.

ఇది కూడా చదవండి..: Mangalagiri Railway Station | రవాణా వ్యవస్థ అనుసంధానమే రాష్ట్ర అభివృద్ధికి కీలకం: నారా లోకేశ్

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *