అక్షరటుడే, ఎల్లారెడ్డి: Lecturer Harassment | జిల్లాలోని ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో (Government Junior College) ఇన్‌ఛార్జి ప్రిన్సిపాల్‌పై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. అదే కళాశాలలో పనిచేసే మహిళా లెక్చరర్‌ను లైంగికంగా వేధించారంటూ ఆరోపణలు రావడంతో కళాశాలలో కలకలం రేగింది.
Lecturer Harassment | ఇంటర్ బోర్డుకు ఫిర్యాదు..
సదరు హిళా లెక్చరర్ ఇన్‌ఛార్జి ప్రిన్సిపాల్ తనను వేధిస్తున్నాడంటూ జూలై 16న ఇంటర్మీడియట్ బోర్డు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో బోర్డు ఉన్నతాధికారులు విచారణ చేపట్టినట్లు సమాచారం. అలాగే జిల్లా కేంద్రంలోని ఎస్పీ, కలెక్టర్ కార్యాలయంలో(SP office) కౌన్సెలింగ్ సైతం ఇంటర్ బోర్డు అధికారులు ఏర్పాటుచేసినట్లు తెలిసింది. ఈ విషయం తెలియగానే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇన్‌ఛార్జి ప్రిన్సిపాల్ వెంటనే సెలవు పెట్టి వెళ్లిపోయినట్లు కళాశాల వర్గాలు చెబుతున్నాయి. బోర్డు అధికారులు ఈ ఘటనను జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. దీంతో కలెక్టర్ కూడా సీరియస్‌గా తీసుకున్నట్లు సమాచారం.
Lecturer Harassment | పూర్తి విచారణకు కమిటీ..
వేధింపులపై పూర్తిస్థాయి విచారణ జరిపేందుకు ఇతర కళాశాలలకు చెందిన ఇద్దరు ప్రిన్సిపాళ్లు, ఒక లెక్చరర్‌తో కూడిన కమిటీని ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఈ కమిటీ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇన్‌ఛార్జి ప్రిన్సిపాల్‌ను విచారించనుంది. ఈ విషయంపై స్థానిక పోలీసులను వివరణ కోరగా ‘తమకు ఇంతవరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు’ అని తెలిపారు. జిల్లా ఇంటర్మీడియట్ బోర్డు అధికారిని సంప్రదించేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇన్‌ఛార్జి ప్రిన్సిపాల్ వ్యవహారశైలిపై గతంలో పనిచేసిన పలు కళాశాలల్లోనూ ఇదే తరహా వేధింపుల ఫిర్యాదులు ఉన్నాయని ఆయా కళాశాలల సిబ్బంది చెబుతున్నారు. గతంలో ఒక కాలేజీలో విద్యార్థినిని వేధించినట్లు కూడా స్థానికంగా చర్చ జరుగుతోంది. అయితే ఈ విషయమై ఇన్‌ఛార్జి ప్రిన్సిపాల్‌ను ఇంటర్ బోర్డు అధికారులు (Intermediate Board) సస్పెండ్ చేసినట్లుగా సమాచారం.
ఇది కూడా చదవండి: CJP చీఫ్ అభిజీత్ దీప్కే ఇంక్ చల్లిన మహిళ