అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Amarnath Yatra Halts | జమ్మూ కశ్మీర్ (Jammu Kashmir)లో ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో అధికారులు అమర్నాథ్ యాత్రను ఆదివారం నుంచి తాత్కాలికంగా నిలిపివేశారు. భక్తుల భద్రత కారణంగా బాల్తాల్, పహల్గాం మార్గాల నుంచి యాత్ర నిలిపి వేశామన్నారు. ఇప్పటివరకు మంచు శివలింగాన్ని 3.7 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు.
జమ్మూ కశ్మీర్లో ఆదివారం సాయంత్రం నుంచి భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తాయని, యాత్రా మార్గాలలో కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలు, ఇతర వాతావరణ సంబంధిత ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. దీంతో యాత్ర నిలిపివేస్తున్నట్లు డివిజనల్ కమిషనర్ అన్షుల్ గార్గ్ తెలిపారు. వాతావరణం అనుకూలించకపోవచ్చనే అంచనాల దృష్ట్యా.. యాత్రికుల భద్రత కోసం జూలై 19వ తేదీ నుండి పహల్గామ్, బల్తాల్ మార్గాలలో అమర్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని ఆయన తెలిపారు. యాత్ర మార్గంలో భద్రతను నిర్ధారించుకున్న తర్వాత, వాతావరణ పరిస్థితులను సమగ్రంగా అంచనా వేసిన తర్వాతే యాత్ర పునఃప్రారంభంపై సమాచారం జారీ చేస్తామన్నారు.
Amarnath Yatra Halts | సెలవుల పొడిగింపు
జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం కాశ్మీర్ లోయ వ్యాప్తంగా పాఠశాలలకు వేసవి సెలవులను వచ్చే బుధవారం వరకు పొడిగించింది. పాఠశాలలు సోమవారం తిరిగి ప్రారంభం కావాల్సి ఉండగా, వాతావరణ సూచన దృష్ట్యా ఈ పొడిగింపును ప్రకటించారు. రాబోయే రోజుల్లో జమ్మూ కశ్మీర్లో విస్తారంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలు, నీరు నిలిచిపోవడం, ప్రభావిత ప్రాంతాలలో రహదారి అనుసంధానానికి అంతరాయం కలిగే అవకాశం ఉందని ఐఎండి హెచ్చరించింది. వాతావరణ పరిస్థితులు మెరుగుపడే వరకు యాత్రికులు, పర్యాటకులు, స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Shri Amarnath Ji Yatra has been temporarily suspended from both the Pahalgam and Baltal routes from 19 July 2026 as a precautionary measure following the IMD’s forecast of inclement weather.
No onward movement of pilgrims will be allowed from the Baltal and Nunwan/Chandanwari… pic.twitter.com/vkqLlEHo0d
— Information & PR, J&K (@diprjk) July 18, 2026
దీనిని కూడా చదవండి : US Iran Conflict | ఇరాన్ దాడుల్లో ఇద్దరు యూఎస్ సైనికుల మరణం.. వైమానిక దాడులతో విరుచుకుపడిన అమెరికా.. గల్ఫ్‌లో భద్రతా ఆందోళనలు!