Ayodhya Donation Theft | అయోధ్యలో వేల కోట్ల చోరీ.. ప్రధానికి రాహుల్​, ఖర్గే లేఖ

అయోధ్య రామ మందిర విరాళాల్లో రూ.వేల కోట్ల చోరీ జరిగిందని లోక్​సభ ప్రతిపక్ష నేత రాహుల్​గాంధీ, కాంగ్రెస్​ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్​ ఖర్గే ప్రధాని మోదీకి లేఖ రాశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Ayodhya Donation Theft | అయోధ్య రామ మందిర విరాళాల్లో రూ.వేల కోట్ల చోరీ జరిగిందని లోక్​సభ ప్రతిపక్ష నేత రాహుల్​గాంధీ (Rahul Gandhi), కాంగ్రెస్​ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్​ ఖర్గే (Kharge) అన్నారు. ఈ మేరకు ప్రధాని మోదీకి లేఖ రాశారు.

అయోధ్య ట్రస్ట్ నియామకాలన్నీ ప్రభుత్వమే చేపట్టిందని రాహుల్​, ఖర్గే గుర్తు చేశారు. ఈ విషయంలో ప్రధాని మోదీ మౌనంగా ఉండటం సరికాదన్నారు. ట్రస్ట్ ఖాతాలు, దర్యాప్తు నివేదిక బయట పెట్టాలని డిమాండ్​ చేశారు. విరాళాల చోరీపై స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలని కోరారు. ఇటువంటి నేరం జరిగినప్పుడు ప్రధాని మౌనంగా ఉండటం ఆమోదయోగ్యం కాదన్నారు. ‘రామ మందిర ట్రస్ట్​ మాజీ ప్రధాన కార్యదర్శి సంపత్​ రాయ్​ మీకు సన్నిహితుడు కాడా’ అని ప్రధానిని ప్రశ్నించారు. ఆలయానికి వచ్చిన నగదు, బంగారం, వెండి వంటి అన్ని కానుకల నిర్వహణతో సహా ట్రస్ట్ ఆర్థిక వ్యవహారాలపై స్వతంత్ర, సమగ్ర విచారణకు ఆదేశించాలని కోరారు.

Ayodhya Donation Theft | రికవరీ చేయాలి

రామ మందిరంలో చోరీ ఘటన ప్రజల నమ్మకాన్ని దెబ్బతీసిందని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. ఈ కేసులో బాధ్యతను నిర్ధారించాలని, నష్టపరిహారం లేదా రికవరీ చర్యలు చేపట్టాలని కోరారు. చోరీల విషయంలో ట్రస్ట్ దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు, పోలీసులు జూన్ 25న ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేసి, ఎనిమిది మందిని అరెస్టు చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది. మరోవైపు అయోధ్యలోని రామమందిర వ్యవహారాలను నిర్వహించే శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ను “ప్రజా ట్రస్ట్” (public trust)గా పునర్వ్యవస్థీకరించేలా కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ నిర్మోహి అఖారా శనివారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

దీనిని కూడా చదవండి : Weather Update | రాష్ట్రానికి నేడు భారీ వర్షసూచన

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *