అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Trainee IPS Harassment | హైదరాబాద్ (Hyderabad)లోని జాతీయ పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపులు కలకలం రేపాయి. ఓ మహిళా ట్రైనీ ఐపీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రాజేంద్రనగర్‌లోని జాతీయ పోలీస్ అకాడమీ (National Police Academy)లో ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్‌కృష్ణారెడ్డి తనను వేధిస్తున్నారంటూ ఓ మహిళా ట్రైనీ ఐపీఎస్ ఫిర్యాదు చేశారు. తనకు ఆయన అసభ్యకర మెసెజ్‌లు పంపుతున్నాడని తెలిపారు. ఈ మేరకు అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ఐపీఎస్ ట్రైనింగ్ అధికారి వేధింపులకు పాల్పడటం తీవ్ర కలకలం రేపుతోంది. ఉద్యోగంలో చేరి మహిళలకు రక్షణ కల్పించాల్సిన ఆయన.. శిక్షణ సమయంలో తోటి ఉద్యోగిని వేధించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. విచారణ అనంతరం ఆయనపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
దీనిని కూడా చదవండి : Sridhar Babu | ఎల్‌నినో ముప్పు.. ప్రతి జిల్లాలో కమాండ్ కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు