అక్షరటుడే, వెబ్‌డెస్క్: Crude Oil Prices | పశ్చిమాసియాలో ముదురుతున్న సంక్షోభం కారణంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతున్నాయి. అమెరికా, ఇరాన్ ల మధ్య యుద్ధం కారణంగా గ్లోబల్ మార్కెట్ (Global Market) సెంటిమెంట్ దెబ్బతింది. అంతర్జాతీయ మార్కెట్లనుంచి అందుతున్న సంకేతాలకు తోడు దేశీయ మార్కెట్లో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగాల షేర్లలో లాభాల స్వీకరణతో బెంచ్‌మార్క్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ భారీ నష్టాలతో సాగుతున్నాయి.
Crude Oil Prices | నష్టాలతో..
సెన్సెక్స్ సోమవారం ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమై 707 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ144 పాయింట్ల నష్టంతో ప్రారంభమై ప్రారంభంతో 72 పాయింట్లు పైకి ఎగబాకినా నిలదొక్కుకోలేకపోయింది. అక్కడినుంచి మరో 113 పాయింట్లు కోల్పోయింది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 608 పాయింట్ల నష్టంతో 77,542 వద్ద, నిఫ్టీ 154 పాయింట్ల నష్టంతో 24,179 వద్ద ఉన్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ వంటి హెవీ వెయిట్ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడితో ప్రధాన సూచీలు నేలచూపులు చూస్తున్నాయి.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 15 స్టాక్స్ లాభాలతో, 15 స్టాక్స్ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. ట్రెంట్ 2.27 శాతం, ఎయిర్టెల్ 1.33 శాతం, ఎన్టీపీసీ 1.30 శాతం, టెక్ మహీంద్రా 0.94 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 0.92 శాతం లాభాలతో ఉన్నాయి.
Top Losers : యాక్సిస్ బ్యాంక్ 5.35 శాతం, హెచ్డీఎఫ్ సీ బ్యాంక్ 4.89 శాతం, కొటక్ బ్యాంక్ 2.35 శాతం, మారుతి 1.86 శాతం, బజాజ్ ఫైనాన్స్ 1.53 శాతం నష్టాలతో ఉన్నాయి.