Ayodhya Donation Theft | అయోధ్య విరాళాల వివాదం.. కేసును రాజకీయ అంశంగా మార్చొద్దన్న సుప్రీంకోర్టు

అయోధ్య రామాలయంలో విరాళాల చోరీ వ్యవహారంపై జరుగుతున్న విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Ayodhya Donation Theft | అయోధ్య రామాలయంలో విరాళాల చోరీ వ్యవహారంపై జరుగుతున్న విచారణలో సుప్రీంకోర్టు ( Supreme Court ) కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసును రాజకీయ అంశంగా మార్చవద్దని పిటిషనర్లకు అత్యున్నత న్యాయస్థానం సూచించింది. కోర్టులను రాజకీయ వేదికలుగా మార్చడం సరికాదని, ఇది కేవలం ఒక నేరానికి సంబంధించిన అంశమని ధర్మాసనం స్పష్టం చేసింది.

Ayodhya Donation Theft | సుప్రీంకోర్టు విచారణ..

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం సోమవారం ( జులై 20 ) ఈ కేసును విచారించింది. కేసు దర్యాప్తు పర్యవేక్షణ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేశారా అని ధర్మాసనం ప్రశ్నించింది. దీనిపై స్పందించిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, ఇప్పటికే కేసు విచారణ కోసం సిట్‌ను ఏర్పాటు చేశామని, యూపీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని కోర్టుకు వివరించారు. దర్యాప్తులో వెల్లడైన కీలక అంశాలతో కూడిన నివేదికను సమర్పించాలని ఆదేశిస్తూ, తదుపరి విచారణను ఈ నెల 27కి న్యాయస్థానం వాయిదా వేసింది.

Ayodhya Donation Theft | దర్యాప్తులో వెలుగుచూస్తున్న వాస్తవాలు..

కేసు దర్యాప్తు చేపట్టిన సిట్, విరాళాల లెక్కింపు ప్రక్రియలో తీవ్ర లోపాలు ఉన్నట్లు గుర్తించింది. ఈ దర్యాప్తులో భాగంగా ఇప్పటికే పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. విరాళాల చోరీ వివాదం ముదురుతున్న తరుణంలో, శ్రీరామ జన్మభూమి ట్రస్టు ప్రధాన కార్యదర్శి పదవికి చంపత్‌ రాయ్‌ రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. కాగా, ఈ కేసును మరింత పారదర్శకంగా విచారించేందుకు సీబీఐ (CBI) దర్యాప్తుతో పాటు, కాగ్ (CAG) ఆడిటింగ్ నిర్వహించాలని పలు వర్గాల నుంచి డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.

ఇది కూడా చదవండి: TSRTC Welfare | త్వరలో ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం.. మంత్రి పొన్నం కీలక ప్రకటన

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *