అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Market Crash | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో క్రూడ్ ఆయిల్ (Crude Oil) ధర బ్యారెల్‌కు 91 డాలర్లు దాటింది. దీనికితోడు జనరిక్ మందులపై ట్రంప్ టారిఫ్ బాంబ్ ప్రకటన ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.
2028 ఆగస్టు నుంచి దిగుమతి చేసుకునే జెనరిక్ ఔషధాలపై 100 శాతం ఆ తర్వాత సంవత్సరం నుంచి 200 శాతం సుంకాలు విధిస్తామని ట్రంప్ ప్రకటించారు. ఇది మన ఔషధ కంపెనీలకు ప్రతికూలంగా మారే అవకాశాలున్నాయి. ఫార్మా, బ్యాంకింగ్ రంగాల స్టాక్స్‌తోపాటు రిలయన్స్ కూడా ప్రధాన సూచీలను వెనక్కి లాగుతున్నాయి.
Stock Market Crash | బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి..
బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వరుసగా మÖడో సెషన్లోనూ నష్టాలతో ఉంది. మెరుగైన త్రైమాసిక లాభాలను ప్రకటించినప్పటికీ బంధన్ బ్యాంక్ 15 శాతానికి పైగా పడిపోయింది. ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్‌లు సైతం ఒక శాతానికిపైగా నష్టంతో ఉన్నాయి.
Stock Market Crash | స్వల్ప నష్టాలతో ప్రారంభమైనా..
దేశీయ స్టాక్ మార్కెట్ బుధవారం ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్ 86 పాయింట్ల నష్టంతో ప్రారంభమై అక్కడినుంచి 662 పాయింట్లు పతనమైంది. నిఫ్టీ 37 పాయింట్ల నష్టంతో ప్రారంభమై 16 పాయింట్లు పెరిగినా.. నిýదొక్కుకోలేక 193 పాయింట్లు కోల్పోయింది. ఉదయం 11.40 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 547 పాయింట్ల నష్టంతో 76,922 వద్ద, నిఫ్టీ 142 పాయింట్ల నష్టంతో 24,045 వద్ద ఉన్నాయి.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 14 స్టాక్స్ లాభాలతో, 16 స్టాక్స్ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. టైటాన్ 0.83 శాతం, హెచ్‌యూఎల్ 0.56 శాతం, ఎన్టీపీసీ 0.53 శాతం, పవర్‌గ్రిడ్ 0.30 శాతం, ఆసియన్ పెయింట్ 0.16 శాతం లాభాలతో ఉన్నాయి.
Top Losers : ఇండిగో 3.42 శాతం, ఎస్బీఐ 1.87 శాతం, యాక్సిస్ బ్యాంక్ 1.62 శాతం, ఇన్ఫోసిస్ 1.27 శాతం, రిలయన్స్ 1.10 శాతం నష్టాలతో ఉన్నాయి.
ఇది కూడా చదవండి..: July 22 Market Analysis | మిక్స్‌డ్‌గా ఆసియా మార్కెట్లు..నష్టాలతో ప్రారంభం కానున్న సెన్సెక్స్, నిఫ్టీ