Paper Leak Fast Track Courts | పేపర్​ లీకేజీలపై ఫాస్ట్​ ట్రాక్​ కోర్టుల ఏర్పాటు : ప్రధాని మోదీ

పేపర్​ లీకులపై విచారణకు ఫాస్ట్​ ట్రాక్​ కోర్టులు ఏర్పాటు చేస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Paper Leak Fast Track Courts | నీట్ పేపర్​ లీకేజీ వ్యవహారంపై పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పేపర్​ లీకులపై ఫాస్ట్​ ట్రాక్​ కోర్టులు ఏర్పాటు చేస్తామని తెలిపింది. ఈ మేరకు ప్రధాని మోదీ (PM Modi) ఎక్స్​ వేదికగా ప్రకటించారు.

మన యువత సంక్షేమం, భవిష్యత్తు కంటే ముఖ్యమైనది ఏదీ లేదని మోదీ పేర్కొన్నారు. పరీక్షా పత్రాల లీకేజీ (పేపర్ లీక్) కేసుల విచారణ కోసం ‘ఫాస్ట్-ట్రాక్ కోర్టుల’ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. పేపర్ లీకేజీలకు పాల్పడిన వారికి త్వరితగతిన కఠిన శిక్షలు పడేలా చూసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ దిశగా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. విద్యార్థుల ప్రయోజనాలను కాపాడేందుకు తాము చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. యువత భవిష్యత్తుకు హాని కలిగించే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

Paper Leak Fast Track Courts | రాజీనామా చేయాల్సిందే

విపక్షాలు, ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) ఆందోళనలు చేస్తున్న తరుణంలో ప్రధాని మోదీ ఈ ప్రకటన చేశారు. ఆయన ప్రకటనపై సీజేపీ స్పందించింది. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాల్సిందేనని పేర్కొంది. అప్పటి వరకు ఆందోళనలు విరమించమని స్పష్టం చేశారు. మరోవైపు విపక్షాలు సైతం పార్లమెంట్​లో ఇదే విషయమై ఆందోళన చేస్తున్నాయి. కేంద్రం చర్చకు అంగీకరించినా.. ధర్మేంద్ర ప్రధాన్​ రాజీనామా చేసిన తర్వాతే నీట్​పై చర్చించాలని పట్టుబడుతున్నాయి.

Paper Leak Fast Track Courts | జంతర్​మంతర్​ వద్ద బలగాల మోహరింపు

జంతర్‌మంతర్‌ వద్దకు గురువారం ఉదయం సీజేపీ కార్యకర్తలు, యువత పెద్ద ఎత్తున చేరుకున్నారు. కేంద్రమంత్రి రాజీనామా చేసేవరకు ఆందోళనలు ఆగవని పేర్కొన్నారు. కాగా ఢిల్లీలో ఉద్రిక్తతల నేపథ్యంలో అధికారులు పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్​ సేవలను నిలిపి వేసిన విషయం తెలిసిందే. దీనిపై ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు జంతర్​మంతర్​ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. జంతర్‌మంతర్‌ నుంచి పార్లమెంట్‌కు వెళ్లే రోడ్లు దిగ్బంధించారు. భారీగా CRPF, RAF, ప్రత్యేక పోలీస్‌ బలగాలు మోహరించారు.

ఇది కూడా చదవండి..: Jantar Mantar Violence | జంతర్‌మంతర్‌లో మళ్లీ హింస.. పోలీసులపైకి రాళ్లు, బాటిళ్లతో దాడి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *