అక్షరటుడే, వెబ్‌డెస్క్: Jantar Mantar Violence | దేశ రాజధాని ఢిల్లీ DELHI లోని జంతర్‌మంతర్‌లో జరుగుతున్న CJP నిరసనలు మరోసారి ఉద్రిక్తంగా మారాయి. బుధవారం పలువురు నిరసనకారులు పోలీసులతో పాటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF) సిబ్బందిపైకి రాళ్లు, బాటిళ్లు విసిరినట్లు అధికారులు తెలిపారు. కొందరు కర్రలతో కూడా దాడికి దిగినట్లు సమాచారం.
Jantar Mantar Violence | భద్రత మరింత కట్టుదిట్టం
ఈ ఘటనలో పలువురు పోలీసులు Police గాయపడినట్లు తెలుస్తోంది. పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు పోలీసులు అదనపు బలగాలను మోహరించి నిరసనకారులను చెదరగొట్టే చర్యలు చేపట్టారు.
హింసాత్మక ఘటనల నేపథ్యంలో జంతర్‌మంతర్ పరిసర ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. శాంతిభద్రతల దృష్ట్యా అధికారులు ఆ ప్రాంతంలో తాత్కాలికంగా ఇంటర్‌నెట్ సేవలపై ఆంక్షలు విధించినట్లు వెల్లడించారు.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, గాయపడిన వారి సంఖ్య, హింసకు దారితీసిన కారణాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.