Actor Ramesh Hospitalized | ఆస్పత్రిలో గబ్బర్‌సింగ్ నటుడు రమేశ్..బ్రెయిన్ స్ట్రోక్‌తో చికిత్స

ప్రముఖ దర్శకుడు హరీశ్ శంకర్ ఆస్పత్రికి చేరుకుని రమేశ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Actor Ramesh Hospitalized | టాలీవుడ్ నటుడు, ‘గబ్బర్‌సింగ్’ చిత్రంతో గుర్తింపు పొందిన నటుడు రమేశ్ హఠాత్తుగా బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యారు. అస్వస్థతకు గురైన ఆయనను కుటుంబ సభ్యులు వెంటనే హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స కోసం చేర్పించారు.

Actor Ramesh Hospitalized | న్యూరాలజిస్టులతో చికిత్స..

వైద్యుల సమాచారం ప్రకారం, రమేశ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో న్యూరాలజిస్టుల ప్రత్యేక వైద్య బృందం ఆయనకు చికిత్స అందిస్తూ నిరంతరం పర్యవేక్షిస్తోంది. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఎప్పటికప్పుడు నిఘా ఉంచినట్లు తెలుస్తోంది.

ఈ విషయం తెలుసుకున్న ప్రముఖ దర్శకుడు హరీశ్ శంకర్ ఆస్పత్రికి చేరుకుని రమేశ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అలాగే ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం.

Jantar Mantar Violence | జంతర్‌మంతర్‌లో మళ్లీ హింస.. పోలీసులపైకి రాళ్లు, బాటిళ్లతో దాడి

రమేశ్ త్వరగా కోలుకోవాలని సినీ ప్రముఖులు, అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *