Danish Kaneria Remarks | రాముడిని, మోదీని తిట్టడమే నిరసనా.. పాక్​ మాజీ క్రికెటర్​ సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీలో జరుగుతున్న నిరసనలపై పాక్​ మాజీ క్రికెటర్​ డానిష్​ కనేరియా సంచలన వ్యాఖ్యలు చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Danish Kaneria Remarks | ఢిల్లీ (Delhi)లో జరుగుతున్న నిరసనలపై పాక్​ మాజీ క్రికెటర్​ డానిష్​ కనేరియా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాముడిని, మోదీని తిట్టడమే నిరసనా అని ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు ఎక్స్​ వేదికగా పోస్ట్ పెట్టారు. అది వైరల్ అవుతోంది.

భారతదేశంలో ప్రతి నిరసన ఒకే స్క్రిప్ట్‌తో సాగుతున్నట్లు అనిపించడం ఆందోళన కలిగిస్తోందని డానిష్​ కనేరియా అన్నారు. రాముడు, భారతమాత, హిందుత్వం, ప్రధాని మోదీ, ఆయన కుటుంబం లక్ష్యంగా దూషణలు చేస్తున్నారని పేర్కొన్నారు. సమస్యలపై చర్చలు, పరిష్కారాల కన్నా నినాదాలు, గందరగోళానికే ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందం జరగకముందే కొందరు రైతులు ఢిల్లీని దిగ్బంధించడానికి వెళ్లారని, ఇది ఓ సర్కస్‌లా మారుతోందన్నారు. ఇంతమంది ప్రజలు ముందుగా నిరసన తెలిపి.. ఆ తర్వాతే వాస్తవాలను సరిచూసుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఒక దేశం ఎలా పురోగమించగలదు అని ఆయన ప్రశ్నించారు.

Danish Kaneria Remarks | రాజకీయ ప్రచారంలో భాగంగా..

విద్యార్థులు, రాజకీయంగా జరుగుతున్న నిరసనలు ఒక ప్రణాళికాబద్ధమైన రాజకీయ ప్రచారంలో భాగమని కనేరియా పేర్కొన్నారు. భారతదేశంలోని ప్రతి నిరసనకూ ఒకే స్క్రిప్ట్ ఉన్నట్లుందని ఆయన ఆరోపించారు. పరిపాలనాపరమైన సమస్యలను లేవనెత్తకుండా, సాంస్కృతిక, రాజకీయ చిహ్నాలపై దాడి చేసే ఒకే తరహా పద్ధతిని ప్రతిపక్షాల నేతృత్వంలోని అనేక నిరసనలు అనుసరిస్తున్నాయని మాజీ క్రికెటర్ పేర్కొన్నారు. సీజేపీకి మద్దతు ఇచ్చే పార్టీలు రాజకీయ అస్థిరతను సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ఏదో ఒక రోజు భారతదేశంలో నేపాల్ లాంటి పరిస్థితిని సృష్టించగలమనే భ్రమలో ప్రతిపక్షం జీవిస్తున్నట్లు కనిపిస్తోందన్నారు.

ఇది కూడా చదవండి..: Paper Leak Fast Track Courts | పేపర్​ లీకేజీలపై ఫాస్ట్​ ట్రాక్​ కోర్టుల ఏర్పాటు : ప్రధాని మోదీ

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *